Dr V Shanta Passes Away: సీనియర్ అంకాలజిస్ట్, కాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్‌వుమన్ డాక్టర్ వి.శాంత... చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. ఉదయం 3.55కి ఆమెకు అనారోగ్యం రావడంతో... హడావుడిగా అపోలో హాస్పిటల్స్‌కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె రక్త నాళాల్లో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగిస్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహాన్ని గాంధీనగర్‌లోని కాన్సర్ ఇన్స్టిట్యూట్ పాత భవనం దగ్గర ఉంచారు. అక్కడ ఆమె 65 ఏళ్ల కిందట రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా చేరారు.
"మా మాజీ చీఫ్ డాక్టర్ ఎస్ కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచామో... అక్కడే ఆమెను కూడా ఉంచాము. ఆయన ఆమెకు ఎన్నో అంశాలలో ప్రేరణ కలిగించారు." అని ఇన్స్టిట్యూట్ సీనియర్ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ ఆర్ స్వామినాథన్ తెలిపారు.
1927 మార్చి 11న నోబెల్ గ్రహీతలు సీవీ రామన్, ఎస్ చంద్రశేఖర్ కుటుంబంలో పుట్టిన శాంత,... అంకాలజీ ఫీల్డును కెరీర్‌గా ఎంచుకున్నారు. ఇన్స్టిట్యూట్లోని ఓ చిన్న గదిలో ఆమె ఉండేవారు. పేషెంట్లు అందరికీ నాణ్యమైన, తక్కువ ఖర్చులో కాన్సర్ ట్రీట్మెంట్ అందేందుకు ఎంతో కృషి చేశారు. ఈ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు చేసి... ఎంతో మందికి అవగాహన కల్పించారు. తనకు తానుగా ఎంతో మంది పేషెంట్లను జాగ్రత్తగా చూసుకన్నారు.
తన జీవితంలో ఎంతో మంది డాక్టర్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు శాంత ప్రేరణగా నిలిచారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య కమిటీలలో ఆమె సేవలందించారు. రామన్ మెగసెసే, పద్మ విభూషణ్ వంటి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీ విద్యార్థి అయిన ఆమె... డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి స్తాపించిన కాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ముత్తు లక్ష్మీ కొడుకైన డాక్టర్ ఎస్ కృష్ణమూర్తి.. అమెరికాలో మెడిసిన్ చదివి... కాన్సర్ ఇన్స్టిట్యూట్లో సేవలు అందించారు. ఆయనతో కలిసి శాంత కూడా అద్యార్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ (WIA)ని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు. 12 బెడ్లతో ఉన్న ఈ ఆస్పత్రి ఎంతో కాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తోంది.
ఇది కూడా చదవండి: Kamala Harris: అమెరికాలో కమలా హారిస్ క్రేజ్...
"ఓ శకం ముగిసిపోయింది" అని ఆమె మృతదేహాన్ని చూస్తూ... డాక్టర్ అరవింద్ కృష్మమూర్తి విషాదంలో మునిగిపోయారు. ఆయనతోపాటూ 67 ఏళ్ల నాటి ఇన్స్టిట్యూట్ ఉద్యోగులంతా కన్నీటి సంద్రమయ్యారు.
Published by:Krishna Kumar N
First published:January 19, 2021, 08:50 IST