• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DR REDDYS COMPLETES SPUTNIK VACCINE PHASE 3 TRIALS REPORT MAY COME IN APRIL SECOND WEEK NK

Sputnik vaccine: గుడ్ న్యూస్.. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేసిన డాక్టర్ రెడ్డీస్

Sputnik vaccine: గుడ్ న్యూస్.. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేసిన డాక్టర్ రెడ్డీస్

గుడ్ న్యూస్.. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేసిన డాక్టర్ రెడ్డీస్ (image credit - twitter)

Sputnik Covid vaccine: ప్రపంచంలో ముందుగా వచ్చిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్. కానీ దానికి ఇండియాలో అనుమతి లభించలేదు. ఇప్పుడు అనుమతి పొందే దిశగా డాక్టర్ రెడ్డీస్ రెడీ అవుతోంది.

  • Share this:
    Sputnik vaccine: ఇండియాలో 140 కోట్ల మంది జనాభా. కరోనాకి విరుగుడుగా సప్లై అవుతున్నవి రెండే వ్యాక్సిన్లు. ఏం సరిపోతాయి? తమకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. మరిన్ని వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఫార్మారంగంలో తనకంటూ ఓ మార్క్ వేసుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్... రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి... ఫేజ్ త్రీ ట్రయల్స్ పూర్తి చేసింది. మూడో దశ ట్రయల్స్‌ని 1500 మందిపై జరిపింది. వీరిలో ఆరోగ్య వంతులు, అనారోగ్యం ఉన్నవారు, దివ్యాంగులు... ఇలా అన్ని రకాల వారూ ఉన్నారు. "ఫేజ్ త్రీలో డోసులు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశాం" అని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి బిజినెస్ లైన్‌కి తెలిపారు.

    ప్రస్తుతం దేశంలో పుణెకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారుచేస్తున్న కోవిషీల్డ్ (Covishield), హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ (Covaxin)... ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని హెల్త్ వర్కర్లకు ఆల్రెడీ ఇచ్చేసి... కరోనా వారియర్లు, 60 ఏళ్లు దాటిన వాళ్లు, 45 ఏళ్లు దాటి... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇప్పుడు ఇస్తున్నారు.

    స్పుత్నిక్ వి... మూడో దశ ఫలితాలు రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్ వచ్చేస్తే... దాన్ని సమర్పించి... సప్లై చేసుకోవానికి అనుమతి పొందాలని డాక్టర్ రెడ్డీస్ ప్రయత్నిస్తోంది. మరి ఫలితాలు రావాలంటే... ఏప్రిల్ మొదటి వారంలో వస్తాయి.

    కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కి పూర్తి ట్రయల్స్ రిపోర్ట్ రాకుండానే కేంద్రం ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది. అలా తమకూ ఇవ్వాలని కోరుతూ... డాక్టర్ రెడ్డీస్ కేంద్రానికి అప్లై చేసుకుంది. కానీ అది విదేశీ వ్యాక్సిన్ కదా... అందుకే కేంద్రం ఎమర్జెన్సీ వాడకానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఫేజ్ త్రీ ట్రయల్స్ డేటా ఇచ్చాకే ఆలోచిస్తాం అని చెప్పింది.

    డాక్టర్లు, నిపుణులు చెబుతున్నదేంటంటే... స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కి ఎఫికసీ ఎక్కువగా ఉందట. అంటే ఏంటంటే... సమర్థత. కరోనా వైరస్‌తో పోరాడే సమర్థత. అందుకే ఈ వ్యాక్సిన్ కి అనుమతి ఇవ్వాలని ఇండియాలో చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం... ఇండియాలో పంపిణీకి అనుమతి పొందే మూడో వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ నిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

    స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ని రష్యా ప్రభుత్వం, అక్కడి గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయాలజీ కలిసి తయారుచేశాయి. ఇదే ప్రపంచపు మొదటి రిజిస్టర్ అయిన కరోనా వ్యాక్సిన్.

    91.6% ఎఫికసీ (efficacy):
    రష్యా సంస్థ ప్రకారం ప్రపంచంలో 91.6 శాతం ఎఫికసీ ఉన్న మూడు వ్యాక్సిన్లలో ఇదొకటి. ఇప్పటికే 26 దేశాలు దీన్ని ఆమోదించాయి. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా పొందారు. నిపుణులు ఏమంటున్నారంటే... దీర్ఘకాలిక నెగెటివ్ సైడ్ ఎఫెక్టులు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వల్ల ఉండవు అంటున్నారు. ఎందుకంటే దాన్ని తయారుచేసిన విధానం సంప్రదాయబద్ధమైనది అంటున్నారు. ఇలాంటి తరహా వ్యాక్సిన్లపై రెండు దశాబ్దాలుగా 250 క్లినికల్ స్టడీస్ వచ్చాయి. అవన్నీ ఇలాంటి వ్యాక్సిన్లు మంచివని చెప్పాయి.

    ఇది కూడా చదవండి: Summer Baby health: ఎండలో పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

    ఇండియాలో హెటెరో (Hetero) సహా... కొన్ని ఫార్మా కంపెనీలు స్పుత్నిక్ వి ఉత్పత్తికి అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. సో... కేంద్రం నుంచి అనుమతులు రావడమే ఆలస్యం అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు