దంతెవాడలో మావోయిస్టు ఎటాక్.. దూరదర్శన్ కెమెరామెన్ దుర్మరణం

ఎలక్షన్ కవరేజీ కోసం వెళ్లిన దూరదర్శన్ బ‌ృందం మావోయిస్టుల ఎటాక్‌కు గురైంది.

news18-telugu
Updated: October 30, 2018, 3:52 PM IST
దంతెవాడలో మావోయిస్టు ఎటాక్.. దూరదర్శన్ కెమెరామెన్ దుర్మరణం
దంతెవాడలో జరిగిన మావోయిస్టుల దాడిలో చనిపోయిన దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద సాహు
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టు ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్ కెమెరామన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు ఉన్నాయి. ఎలక్షన్ కవరేజీ కోసం వెళ్లిన దూరదర్శన్ బ‌ృందం మావోయిస్టుల ఎటాక్‌కు గురైంది. దూరదర్శన్‌ తరఫున రిపోర్టర్ ధీరజ్ కుమార్, కెమెరామన్ అచ్యుతానంద సాహు, లైట్ అసిస్టెంట్ మర్ముక్త్ శర్మ కవరేజీ నిమిత్తం వెళ్లారు. వారిలో సాహు ప్రాణాలు కోల్పోయాడు. అచ్యుతానంద సాహు ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దంతెవాడ జిల్లాలోని అరన్‌పూర్‌లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. వారితో పాటు దూరదర్శన్ బృందం కూడా వెళ్లింది. అయితే, మావోయిస్టులు దాడి చేయడంతో వారు చనిపోయారు. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద సాహు మృతిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. సాహు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డేంజర్ ఉందని తెలిసి కూడా ఎన్నికల కవరేజీకి వెళ్లిన మీడియా వారి ధైర్యాన్ని ఆయన అభినందించారు. అచ్యుతానంద సాహు త్యాగాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. మరోవైపు కెమెరామెన్ మీద నక్సల్ దాడిని సీఆర్పీఎఫ్ ఖండించింది.


ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 12న తొలిదశ, నవంబర్ 20న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది.


First published: October 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>