కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (AIRF) లేఖ రాసింది. వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేస్తున్న శ్రామిక్ రైళ్ల విషయంలో రాజకీయాలొద్దని హితవు పలికింది. రైల్వే స్టేషన్లో రద్దీలేకుండా చేసేందుకే రైల్వేశాఖ చార్జీ వసూలు చేస్తోందని లేఖలో తెలిపింది. కరోనా సమయంలో రైళ్లలో ప్రయాణం అత్యంత ప్ర్రమాదకరమని తెలిసినా.. రైల్వే సిబ్బంది ఎంతో శ్రమించి వలస కార్మికులను తరలిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు AIRF నేతలు. రైల్వే సిబ్బంది ఆరోగ్య గురించి కూడా ఆలోచించాలని అన్నారు. రైల్వే స్టేషన్లలో ఎక్కువ మంది జనం గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.
కరోనా లాక్డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం మే 1 నుంచి శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ. ఐతే వలస కార్మికుల తరలింపు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఎవరిని తరలించాలి? ఎక్కడికి తరలించాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. వారి ప్రయాణ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. ఐతే వలస కార్మికులను ఉచితంగా తరలించకుండా.. చార్జీలు వసూలు చేయడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ డబ్బులు మేమిస్తా..మీరు రైళ్లను నడపాలని ఇటీవల సోనియా గాంధీ రైల్వేశాఖకు లేఖరాశారు. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్‌గా AIRF లేఖ రాసింది.
Published by:
Shiva Kumar Addula
First published:
May 7, 2020, 4:21 PM IST