Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు

Election 2019 | ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తప్పనిసరి. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 28న ఆర్డర్ జారీ చేసింది. ఓటర్ ఐడీ కార్డు లేని వాళ్లు ఏఏ ఐడీ కార్డులు తీసుకెళ్లాలో ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ 11 ఐడెంటిటీ కార్డులు ఇవే.

news18-telugu
Updated: March 29, 2019, 3:23 PM IST
Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు
Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఈ డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు
news18-telugu
Updated: March 29, 2019, 3:23 PM IST
దేశమంతా ఎన్నికల సందడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నాయకుల ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏప్రిల్ 11న జరగబోయే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలుచోట్ల ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్(EPIC), ఫోటో ఓటర్ స్లిప్, ఓటర్స్ గైడ్ పంపిణీ మొదలైంది. మిగతా ప్రాంతాల్లో కూడా వీటి పంపిణీ ప్రక్రియ వేగవంతం కానుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి మరీ వీటిని అందజేస్తున్నారు. ఫోటో ఓటర్ స్లిప్ ఉన్నంతమాత్రానా ఓటు వేసే అవకాశం లేదు. ఓటర్ ఐడీ కార్డు ఉండాలి. ఒకవేళ ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తప్పనిసరి. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 28న ఆర్డర్ జారీ చేసింది. ఓటర్ ఐడీ కార్డు లేని వాళ్లు ఏఏ ఐడీ కార్డులు తీసుకెళ్లాలో ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ 11 ఐడెంటిటీ కార్డులు ఇవే.

1. పాస్‌పోర్ట్.
2. డ్రైవింగ్ లైసెన్స్.

3. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఐడీకార్డు.
4. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు జారీ చేసిన పాస్‌బుక్స్. ఫోటోతో ఉన్నవి.


5. పాన్ కార్డ్.
6. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్.
Loading...
7. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్.
8. కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ స్మార్ట్ కార్డ్.
9. ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్.
10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక ఐడీ కార్డ్.
11. ఆధార్ కార్డ్.

Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి

Voter Helpline App: ఓటర్ హెల్ప్‌లైన్ యాప్... ఎలా వాడాలో తెలుసుకోండి

Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడిందా? ఇలా చేయండి
First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...