Home /News /national /

DONT CREATE CONFUSION MAYAWATI SNUBS CONGRESS OVER ITS 7 SEAT OFFER SAYS SP BSP ALLIANCE CAN DEFEAT BJP NK

మీ ఆఫర్లు, జాలి చూపులూ నాకు అక్కర్లేదు... కాంగ్రెస్‌కు మాయావతి స్ట్రాంగ్ కౌంటర్

Lucknow: Bahujan Samaj Party supremo Mayawati addresses a press conference, in Lucknow, Sunday, Sept 16, 2018. (PTI Photo/Nand Kumar)(PTI9_16_2018_000063B)

Lucknow: Bahujan Samaj Party supremo Mayawati addresses a press conference, in Lucknow, Sunday, Sept 16, 2018. (PTI Photo/Nand Kumar)(PTI9_16_2018_000063B)

Lok Sabha Elections 2019 : ఫైర్ బ్రాండ్ మాయావతి చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. ఎవ్వర్నీ లెక్కచెయ్యట్లేదు.

దేశ రాజకీయాల్లో కొందరు నేతలు కొరకరానికొయ్యల్లా ఉంటారు. వాళ్లతో డీల్ కుదుర్చుకోవడం గానీ, పొత్తులు పెట్టుకోవడం గానీ చాలా కష్టం. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేం. అలాంటి వారిలో టాప్ టెన్‌లో ఉంటారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎప్పుడూ తన ప్రత్యర్థి కాంగ్రెస్ లేదా సమాజ్ వాదీ పార్టీగా భావించే ఆమెకు... ఇప్పుడు యూపీలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీయే అసలైన ప్రత్యర్థిగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఆమె... వైరాలన్నీ పక్కనపెట్టి... ఎస్పీతో జట్టు కట్టారు. కాంగ్రెస్‌పై జాలి తలచి... రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ... మరో పార్టీ RLD కలిసి పోటీ చెయ్యబోతున్నాయి.

బీఎస్పీ-ఎస్పీ కూటమిలో భాగస్వామ్యం కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీకీ... సీట్లు లేకపోవడమే సమస్యగా మారింది. అందుకే... ఆ రెండు స్థానాలతోపాటూ... మిగతా చోట్లా పోటీ చేయాలనుకుంటున్నా... ఎస్పీ-బీఎస్పీలతో వైరాన్ని మాత్రం పెంచుకోకుండా జాగ్రత్త పడుతోంది. తద్వారా ఎన్నికల తర్వాత ఆ కూటమిని యూపీఏలో కలుపుకోవడానికీ లేదా... అదే కూటమిలో చేరడానికీ ఉన్న అవకాశాల్ని కాంగ్రెస్ చేజార్చుకోవట్లేదు.

కాంగ్రెస్ ప్రయత్నాలు మాయవతికి ఏమాత్రం నచ్చట్లేదు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ప్రకటనను మాయావతి తిప్పికొట్టారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలో ముఖ్య నేతలు పోటీ చేసే 7 చోట్ల తమ అభ్యర్థుల్ని నిలబెట్టట్లేదని కాంగ్రెస్ ప్రకటించింది. దానిపై సీరియస్‌గా రియాక్టైన మాయావతి... మీ జాలి మాపై చూపించక్కర్లేదని ఫైర్ అయ్యారు. ఎవరి సాయమూ లేకుండానే తాము కూటమిగా బీజేపీని దెబ్బకొడతామని ట్విట్టర్‌లో ప్రకటించారు. కాంగ్రెస్‌తో తమకు యూపీలో, బయటా కూడా ఎలాంటి సంబంధమూ లేదన్న ఆమె... యూపీలోని 80 స్థానాల్లో అభ్యర్థుల్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవచ్చని తేల్చారు.



ఇలా అంటూనే... రాహుల్ బరిలో దిగే అమేథీ, ప్రియాంకా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీలో మాత్రం ఎస్పీ, బీఎస్పీ తమ అభ్యర్థుల్ని నిలబెట్టలేదు.
First published:

Tags: Lok Sabha Election 2019, Mayawati, Sp-bsp, Uttar pradesh

తదుపరి వార్తలు