కావేరీ వివాదంపై దేవెగౌడ ‘అనుభవం’ అక్కరకు వస్తుందా?

కర్ణాటక-తమిళనాడు మధ్య 140 ఏళ్లుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదం పరిష్కారానికి మాజీ ప్రధాని దేవెగౌౌడకున్న లోతైన అనుభవం అక్కరకు వస్తుందా?

news18
Updated: June 25, 2018, 11:47 AM IST
కావేరీ వివాదంపై దేవెగౌడ ‘అనుభవం’ అక్కరకు వస్తుందా?
ఫైల్ ఫోటో: కర్ణాటక సీఎం కుమారస్వామితో ఆయన తండ్రి దేవెగౌడ(PTI)
  • News18
  • Last Updated: June 25, 2018, 11:47 AM IST
  • Share this:
తమిళనాడు-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఎన్నో దశాబ్ధాలుగా నలుగుతున్న సమస్య కావేరీ నదీ జలాల వివాదం. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో కొలువుదీరిన కొత్త సర్కారు కావేరీ నదీ జలాల వివాదాన్ని ఎలా డీల్ చేయబోతుందన్న అంశం సర్వత్రా ఆసక్తిరేపుతోంది. కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడకు కావేరీ నదీ జలాల వివాదంపై ఉన్న లోతైన అవగాహన, సుదీర్ఘ రాజకీయ అనుభవం కావేరీ వివాదం పరిష్కారానికి అక్కరకు వస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.

కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు కుమారస్వామి. ఈ సందర్భంగా 86 ఏళ్ల దేవెగౌడ రాజకీయ అనుభవంపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. దేశంలో నదీ జలాల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టులపై దేవెగౌడకున్న అపారమైన అవగాహనను ప్రధాని మోదీ ఎంతో మెచ్చుకున్నారంటూ ఆయనతో భేటీ అనంతరం కుమారస్వామి మీడియాతో చెప్పారు. మరీ ముఖ్యంగా 140 ఏళ్లుగా తమిళనాడు-కర్ణాటకల మధ్య కొనసాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై దేవెగౌడకున్న లోతైన అవగాహనను మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

తమిళనాడు-కర్ణాటకల మధ్య 140 ఏళ్లుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం
తమిళనాడు-కర్ణాటకల మధ్య 140 ఏళ్లుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం


ఢిల్లీ పర్యటన నుంచి వెనుదిరిగి వచ్చిన కుమారస్వామి...కర్ణాటక, తమిళనాడు, కేరళా, పుదుచ్చేరి మధ్య కావేరీ నదీ జలాల పంపకాలను సమీక్షించేందుకు గతవారం కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయడంపై పెదవి విరిచారు. ఈ విషయంలో కేంద్రం కర్ణాటక అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లిందని విమర్శించారు. కుమారస్వామి లేటెస్ట్ కామెంట్స్‌తో కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ నదీ వివాదం మళ్లీ అగ్గి రాజేయం ఖాయమన్న పరిస్థితి నెలకొంది.

అయితే ఈ విషయంలో తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న దేవెగౌడ..పరిస్థితి చేజారకుండా తగిన సమయంలో రంగంలోకి దిగారు. కుమారస్వామిని ఆదివారం తన ఇంటికి పిలిపించుకున్న ఆయన...కావేరీ నదీ జలాల వివాదంపై కీలక సూచనలు, సలహాలు చేసినట్లు తెలుస్తోంది. కావేరీ జలాల వివాదం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టుతో ఘర్షణాత్మక వైఖరిని అవలంభించడం సరికాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్ర, తమిళనాడుకు ఆమోదయోగ్యమైన రాజీ ధోరణిలో ముందుకెళ్లడం మంచిదని సూచించారు.

అదే సమయంలో కర్ణాటక ప్రయోజనాలకు గండిపడకుండా కేంద్రం, సుప్రీంకోర్టు ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించాలని సూచించారు. ఇందు కోసం కావేరీ నదీ జలాల వివాదంపై సమగ్ర వివరాలు, గణాంకాలతో కూడిన బుక్‌లెట్‌ను రూపొందించి కేంద్రం, సుప్రీంకోర్టుకు సమర్పించాలని సలహా ఇచ్చారు. ఆ మేరకు ఈ సమావేశం ముగిసిన వెంటనే కుమారస్వామి అడ్వకేట్ జనరల్ ఉదయ్ హొల్ల, సాగునీటి ప్రాజెక్టుల నిపుణుడు వెంకట్రాంతో సమావేశమై కావేరీ జలవివాదంపై చర్చించారు. తండ్రి సలహా మేరకు వెంటనే సమగ్ర వివరాలు, గణాంకాలతో కూడిన బుక్‌లెట్‌ను రూపొందించాలని సూచించారు.

ఈ బుక్‌లెట్‌ను జతచేర్చి జల వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ సీఎం కుమారస్వామి త్వరలోనే ప్రధాని మోదీకి సమగ్ర లేఖ రాయనున్నారు. దీని కాపీలను కర్ణాటక, తమిళనాడు ఎంపీలకు కూడా పంపాలని దేవెగౌడ కుమారస్వామికి సలహా ఇచ్చారు.సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం గత వారం కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. తమ రాష్ట్రం తరఫు ప్రతినిధులను సూచించేందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించడంతో ఈ అథారిటీలో కర్ణాటక ప్రతినిధులు ఎవరికీ చోటు కల్పించలేదు. కర్ణాటక ప్రతినిధులెవరూ లేకుండానే కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడాన్ని దేవెగౌడ ఖండించారు. షరతులతో కూడిన లేఖతో పాటు ఇద్దరు ప్రతినిధులను అథారిటీకి పంపనున్నట్లు ఆయన చెప్పారు.

కావేరీ జల వివాదంపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..కర్ణాటకకు 11 వేల మిల్లియన్ క్యూబిక్ అడుగుల నదీజలాలను కేటాయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక అంగీకరించింది. అయితే కావేరీ నదీ జలాల పంపిణీని పర్యవేక్షించేందుకు కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడాన్ని కర్ణాటక వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం గతవారం కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది.
Published by: Janardhan V
First published: June 25, 2018, 11:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading