హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: " నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి... ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు ".. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

PM Modi: " నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి... ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు ".. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

File Photo

File Photo

PM Modi: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే మీకు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఇలా సమాధానం ఇచ్చారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అద్భుతంగా పని చేస్తున్నారని, ఆయన చాలా మంచి మనిషని పేర్కొన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump). భారతదేశాని (India)కి మోదీ కంటే మంచి మిత్రుడు లేరని పేర్కొన్నారు. మోదీతో తనకు చాలా మంచి అనుబంధం ఉందన్నారు. న్యూయార్క్‌ సమీపంలోని బెడ్‌మిన్‌స్టర్‌లోని తన స్పెషల్ గోల్ఫ్‌ క్లబ్‌లో NDTVకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మోదీతో, ఇండియాతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీకి దిగే ఆలోచన ఉన్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడిన అంశాలు ఇవే..భారత్‌, అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మోదీ గొప్ప వ్యక్తి అని, ఆయన అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. ఇది ఆయనకు సులువుగా లభించిన అవకాశం కాదన్నారు. మోదీకి, తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, ఆయన చాలా మంచి మనిషని చెప్పారు.


* భారత్‌తో అనుబంధం
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే మీకు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఇలా సమాధానం ఇచ్చారు.
‘మీరు ఆ విషయం ప్రధాని మోదీని అడగాలి. కానీ ఇండియాకు ట్రంప్‌తో ఉన్నంత సంబంధాలు ఇతర ఏ అమెరికా అధ్యక్షుడికి లేవని నేను భావిస్తున్నాను. ట్రంప్‌కి భారత్‌తో అనుబంధం ఎక్కువ.’ అని చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఇండియా, అమెరికాలో జరిగిన వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడారు. పెద్ద పెద్ద సమావేశాల్లో ప్రసంగించినప్పుడు తనకు మోదీ నుంచి, భారత ప్రజల నుంచి గొప్ప సపోర్ట్‌ లభించిందని ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు.
* హౌడీ, మోడీ
భారత్‌తో తనకున్న సంబంధాలను పదవిలో ఉండగా ఏర్పరచుకున్న బలమైన సంబంధాలలో ఒకటిగా ట్రంప్‌ అభివర్ణించారు. 2019 సెప్టెంబరులో, పీఎం మోదీ తిరిగి ఎన్నికైన కొన్ని నెలల తర్వాత, టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని ఓ కార్యక్రమానికి మోదీ, ట్రంప్‌ కలిసి హాజరయ్యారు. వేలాది మంది భారతీయ అమెరికన్లు హాజరైన భారీ "హౌడీ, మోడీ" ర్యాలీని ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు.
ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ ‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ తర్వాత ఐదు నెలలకు.. ట్రంప్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ను సందర్శించారు. అక్కడ ఇద్దరు ఆప్యాయంగా కౌగిలించుకొని కొత్త క్రికెట్ స్టేడియంలో జరిగిన మెగా సమావేశంలో ప్రసంగించారు.
* 2024 అధ్యక్ష ఎన్నికలు
ఓ ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిస్తూ.. ప్రతి ఒక్కరు తనను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. అన్ని పోల్స్‌ కూడా ఈ విషయాన్నే చెబుతున్నాయన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు.
ఇది కూడా చదవండి : అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం.. చుట్టూ చక్కర్లుకొట్టిన వ్యక్తి.. ఏపీ ఎంపీ పీఏనట..!
* ట్రంప్‌ 2.0
ట్రంప్ 2.0 అవకాశం, అమెరికా, భారతదేశం ప్రాధాన్యతల గురించి అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ సమాధానం ఇచ్చారు. అమెరికాను ఎనర్జీ ఇండిపెండెంట్‌గా నిలుపుతామని చెప్పారు. భారతదేశం ప్రధాని మోదీ నేతృత్వంలో బాగానే పని చేస్తుందని అన్నారు. తాను ప్రస్తుతం అమెరికా ప్రాధాన్యతల గురించే మాట్లాడతానని చెప్పారు.
అమెరికా ఎనర్జీ ఇండిపెండెంట్‌గా ఎదుగుతుందని, గొప్ప ఆర్థిక వ్యవస్థను అమెరికా పొందబోతోందని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రతి రికార్డును సాధిస్తామని అన్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు ఉన్న ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఎప్పుడూ లేదని తెలిపారు. గత రెండేళ్లలో అసలు పట్టించుకోని, ఎనర్జీ ఇండిపెండెన్స్‌ని తిరిగి తీసుకొస్తామని ట్రంప్‌ చెప్పారు.

First published:

Tags: Donald trump, International news, National News, PM Narendra Modi

ఉత్తమ కథలు