Donald Trump India Visit: తాజ్ మహల్ సందర్శనలో ట్రంప్, మెలానియా దంపతులు

భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికా అధికార యంత్రాంగంలోని ఉన్నతాధికారులతో కలిసి తాజ్ మహల్ చేరుకున్నారు.

news18-telugu
Updated: February 24, 2020, 5:44 PM IST
Donald Trump India Visit: తాజ్ మహల్ సందర్శనలో ట్రంప్, మెలానియా దంపతులు
తాజ్ మహల్ సందర్శనలో ట్రంప్ దంపతులు (Twitter)
  • Share this:
రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద పర్యటన ముగించుకొని నేరుగా ఆగ్రా చేరుకున్నారు. అక్కడ ఆయన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికా అధికార యంత్రాంగంలోని ఉన్నతాధికారులతో కలిసి తాజ్ మహల్ చేరుకున్నారు. అక్కడ ఆయన తన భార్య మెలానియాతో కలిసి ఓ గైడ్ సహాయంతో పరిసరాల్లో కలియతిరిగారు. అలాగే ఇవాంక దంపతులు సైతం ఏకంతంగా కలియతిరిగారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అధికారులు ఇప్పటికే అక్కడి గార్డెన్ లు , ఫౌంటెన్లను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.

తాజ్ మహల్‌తో ట్రంప్‌కు ఎంతో అనుబంధం ఉంది. 1990 లో న్యూజెర్సీలోని ఆయన తాజ్ మాహల్ పేరుతో క్యాసినోన ప్రారంభించారు. ట్రంప్ తాజ్ మహల్ కేసినోను 2017 లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్‌కు డోనాల్డ్ ట్రంప్ అమ్మేశారు.



First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు