హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

corona : ఆ ఖైదీలను వదిలి వేయండి..సుప్రిం కోర్టు ధర్మాసనం

corona : ఆ ఖైదీలను వదిలి వేయండి..సుప్రిం కోర్టు ధర్మాసనం

ఎన్వీ రమణ

ఎన్వీ రమణ

corona : కొవిడ్ మహమ్మారితో ప్రజా జీవనం స్థంబించి పోతుంటే..మరి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుంది. కరోనా ఎవ్వరిని ఎప్పుడు కబలిస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో జైళ్లలో మగ్గుతున్న ఖైదీల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలలపై సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...

కరోనా సాధరణ జనజీవనాన్ని స్థంబింప చేస్తూ ..ప్రజల్లో ఆందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..అయితే ఇది ఓ రకంగా నేరారోపణలు ఎదుర్కోంటున్న నిందుతులకు ఊరట తెచ్చిపెట్టింది. నేరాలు చేస్తున్న నిందితులతో జైళ్లు నిండిపోతున్న నేపథ్యంలోనే కొవిడ్ ద‌‌ృష్ట్యా నిందితుల అరెస్ట్ పై కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షలు పడే వారిని ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే పెరోలు పై ఉన్న వారికి సైతం మరో మూడు నెలల పాటు సెలవులు మంజూరు చేసింది. దీంతో కరోనాను అడ్డుకునేందుకు జైళ్లను ఖాళీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టుంది.

ముఖ్యంగా కరోనా నేపథ్యంలోనే జైళ్లు కిక్కిరిసి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హై లెవల్ కమిటీలను నియమించాలని తెలిపింది.ఈ నేపథ్యంలోనే ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే వారి బెయిలు మంజూరు పై పరిశీలించాలని తెలిపింది.

కాగా జైళ్లలో ఇప్పటికే మగ్గుతున్న వారిని రెగ్యులర్ టెస్టులు చేయించి, కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించింది. ఇక కోవిడ్ సోకిన వారికి ప్రత్యేక చికిత్స అందించాలని తెలిపింది. మరోవైపు జైళ్లలో పరిశుభ్రత అంశాలపై ప్రతి రోజు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది.జైళ్లలో కరోనా సోకడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రిం కోర్టు విచారణ సంధర్బంగా చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.

Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Supreme Court

ఉత్తమ కథలు