దేశీయ విమానాలు ఎగిరే టైమ్ వచ్చింది... కేంద్రమంత్రి తీపికబురు

15వ తేదీలోగా దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.

news18-telugu
Updated: May 9, 2020, 3:14 PM IST
దేశీయ విమానాలు ఎగిరే టైమ్ వచ్చింది... కేంద్రమంత్రి తీపికబురు
ఇండిగో విమానం(File)
  • Share this:
దేశీయంగా విమానయానాన్ని ప్రారంభించేందుకు కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే విమానాలు ఎగిరే అవకాశం ఉంది. 15వ తేదీలోగా దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఔట్ లుక్ మేగజీన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మేం డొమెస్టిక్ ఫ్లైట్లను వీలైనంత త్వరగా మే 15కు ముందే పునఃప్రారంభించాలనుకుంటున్నాం. వీలైనంత త్వరగా ప్రారంభించాలనేది నా ప్రయత్నం. కానీ, నేను కచ్చితంగా ఓ డేట్ అనేది చెప్పలేదు. ప్రస్తుతం జరుగుతున్న తరలింపు ప్రక్రియకు రాష్ట్రాల సహకారం కూడా కావాలి. దేశీయంగా విమానాలు ఎగరాలంటే అందుకు సరిపడిన యంత్రాంగం, మౌలిక వసతులు కూడా కావాలి.’ అని హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఒకసారి కమర్షియల్ ఫ్లైట్లు ప్రారంభం అయితే ఇక దాన్ని తరలింపు అనబోరని చెప్పారు. కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైతే ప్రతి ఒక్కరూ ప్రయాణించవచ్చు.

గ్రీన్ జోన్ల మధ్య విమానాల రాకపోకలను ప్రారంభిస్తారా? అని ప్రశ్నించగా, దేశ భౌగోళిక పరిస్థితిన చూస్తే గ్రీన్ జోన్ల మధ్య విమానయానం సులభమే అయినా, మెట్రో పాలిటన్ సిటీలను మనం పూర్తిగా వదిలివేయలేమన్నారు. దాదాపు అన్ని మెట్రో సిటీలు రెడ్ జోన్లలోనే ఉన్నాయి. దీని మీద త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారత్‌లో మార్చి 24 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. ప్రస్తుతం మే 17వరకు లాక్ డౌన్ ఉంది.
First published: May 9, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading