Home /News /national /

DOLO 65O MAKERS DISTRIBUTED RS 1000 CRORES FREEBIES TO DOCTORS FOR PRESCRIBING ANTI FEVER DRUG DURING COVID 19 PANDEMIC SK

Dolo Tablets: డాక్టర్లకు వెయ్యి కోట్ల తాయిలాలు.. డోలో టాబ్లెట్స్‌కు డిమాండ్ వెనక అసలు కథ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dolo Tablets: కరోనాను ఎదుర్కొనేందుకు సంజీవని లాంటి ఔషధం డోలో-650నే అంటూ.. ప్రజలకు తమ మాత్రలను సూచించాలని.. డాక్టర్లకు డోలో తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ (Micro Labs) సూచించిందని FMSRAI సుప్రీంకోర్టులో పిల్ వేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  కోవిడ్ (Corona Pandemic) సమయంలో మన దేశమే కాదు.. యావత్ ప్రపంచం కూడా అల్లాడిపోయింది. కరోనా బారినపడి ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు మరణించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఓ టాబ్లెట్ పేరుమాత్రం మార్మోగిపోయింది. అదే డోలో-650 ఎంజీ (Dolo-650 MG). ఈ టాబ్లెట్స్ వేసుకుంటే కరోనా ప్రభావం తక్కువగా ఉందని ప్రచారం జరగడం.. డాక్టర్లు కూడా అవే మందులను రోగులకు సూచించడంతో.. డోలో అమ్మకాలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2020 మార్చిలో కరోనా ప్రారంభమైన తర్వాత రూ.567 కోట్ల డోలో అమ్మకాలు జరిగాయి. రెండేళ్లలోనే 350 కోట్ల టాబ్లెట్స్ అమ్ముడయ్యాయి. ఐతే ఈ స్థాయిలో డోలో అమ్మకాలు జరగడానికి కారణం దీని సామర్థ్యం కాదని..అసలు వేరే కథ ఉందని ప్రస్తుతం రచ్చ జరుగుతోంది.

  హఠాత్తుగా పాలు మానేసిన 8 నెలల బాలుడు.. మెడికల్ రిపోర్ట్ చూసి పేరెంట్స్ షాక్

  కరోనాను ఎదుర్కొనేందుకు సంజీవని లాంటి ఔషధం డోలో-650నే అంటూ.. ప్రజలకు తమ మాత్రలను సూచించాలని.. డాక్టర్లకు డోలో తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ (Micro Labs) సూచించిందని ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ (FMSRAI)ఆరోపిస్తోంది. అందుకోసం దేశవ్యాప్తంగా వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చిందని బాంబు పేల్చింది. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల డోలో–650 ఎం.జీ ఉత్పత్తిదారుల ప్రాంగణాల్లో సెంట్రల్‌ బోర్డు ఫర్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(CBDT) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ కంపెనీ ఔషధాలనే రోగులకు సూచించాలంటూ వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఫార్మాస్యూటికల్‌ సంస్థలను చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ (FMSRAI) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.

  Krishnastami 2022: ఉట్టికొట్టే వారికి రూ.55 లక్షల నజరానా..ఫారిన్ ట్రిప్ ప్యాకేజ్ కూడా ఫ్రీ

  FMSRAI తరపున లాయర్లు సంజయ్‌ పారిఖ్, అపర్ణా భట్‌ వాదనలు వినిపించారు. ట్యాబ్లెట్ల పరిమాణం 500 ఎం.జీ. వరకు ఉంటే.. వాటి మార్కెట్ ధరను నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని.. అంతకుమించిన ఎం.జీ ఉంటే ఆ టాబ్లెట్ల కంపెనీలే ఇష్టానుసారం ధర నిర్ణయించుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక లాభాలను సాధించాలన్న ఉద్దేశ్యంతో... 650 ఎం.జీ డోస్‌ ఉన్న తమ సంస్థ ట్యాబ్లెట్లనే రోగులకు సూచించాలని.. డోలో–650 తయారీదారులు వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారని కోర్టుకు వివరించారు. ఫార్మాస్యూటికల్‌ మార్కెటింగ్‌ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరింది. అప్పుడే పర్యవేక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తూ.. పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. కోడ్‌ ఉన్నప్పటికీ దానికి స్వచ్ఛంద హోదా లేదా చట్టబద్ధంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.  ఐతే చట్టాలు రూపొందించాలని తాము పార్లమెంటును ఆదేశించలేమని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. ఐతే కోడ్‌కు చట్టబద్ధత వచ్చే వరకు ఔషధ సంస్థల అనైతిక మార్కెటింగ్‌ పద్ధతులను నియంత్రించడానికి కోర్టు మార్గనిర్దేశనం చేయాలని లాయర్ పారిఖ్‌ కోరారు. ఫార్మా స్యూటికల్‌ సంస్థల అనైతిక మార్కెటింగ్‌ పద్దతులను అవలంబిస్తున్నాయని.... అధిక/అహేతుక ఔషధాల ప్రిస్కిప్షన్, అధిక ధర ఉన్న ఔషధాలనే రోగులకు వైద్యులు సూచించే పద్ధతులు ఇటీవల బాగా పెరిగాయని ఆరోపించారు. ఇది ఆర్టికల్‌ 21 ద్వారా సంక్రమించిన ప్రజల జీవించే హక్కును ఉల్లంఘించినట్లేనని కోర్టుకు తెలిపారు. FMSRAI లేవనెత్తిన అంశంపై జస్టిస్‌ చంద్రచూడ్‌ ఏకీభవించారు. తనకు కోవిడ్‌ సోకినప్పుడు కూడా డాక్టర్లు డోలోనే సూచించారని... దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించాని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై 10 రోజుల్లో స్పందిచాలని కేంద్రాన్ని ఆదేశించారు. వారం రోజుల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని FMSRAI సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 29కి వాయిదా వేసింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు