హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గంటల పాటు ఒకే గదిలో పులి, కుక్క.. ఎలా వెళ్లాయి, ఏం జరిగిందటే.. Interesting story

గంటల పాటు ఒకే గదిలో పులి, కుక్క.. ఎలా వెళ్లాయి, ఏం జరిగిందటే.. Interesting story

Twitter image

Twitter image

గంటల సమయం కళ్ల ముందు కుక్క (Dog) ఉన్నా ఆ పులి (Leopard) ఏ హానీ చేయలేదు. అప్పటి వరకు కసిగా వెంటాడిన ఆ పులి తాళం వేసిన గదిలోకి వచ్చేసరికి ఓ మూలకు కూర్చుంది. అసలు పులి, కుక్క ఆ గదిలోకి ఎలా వెళ్లాయి.. ఏమైందంటే

  ఓ పులి, ఓ కుక్క తొమ్మిది గంటల పాటు తాళం వేసిన ఓ గదిలో చిక్కుకున్నాయి. అడుగు దూరంలోనే కూర్చున్నాయి. అంత వరకు వేటాడిన పులి మాత్రం ఎందుకో సైలెంట్ అయిపోయింది. పంజా దూరంలోనే కుక్క ఉన్నా ఏ మాత్రం కిక్కురుమనకుండా మూలకు నక్కింది. ఆ కుక్క సైతం భయపడి కూడా చేసేదేముంది అన్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

  కకింబ నగరానికి సమీపంలోని బిలినెలె గ్రామంలో జయలక్షి అనే వ్యక్తికి ఫామ్​హౌస్ ఉంది. హఠాత్తుగా ఫామ్ హౌస్​లో టాయ్​లెట్​లోకి ఓ కుక్క పరుగెత్తుకొచ్చింది. దాన్ని వెంబడిస్తూ ఓ పులి కూడా వచ్చింది. తెల్లవారుజామున 4 సమయంలో పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి దీన్ని గమనించిన జయలక్ష్మి భయపడుతూనే టాయ్​లెట్ డోర్​కు తాళం వేసేశారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.

  అక్కడికి వచ్చిన అధికారులు కిటికీలో నుంచి బాత్​రూమ్​లో తొంగిచూశారు. అక్కడే వారు షాకయ్యారు. పులి, కుక్క ఎదురెదురుగా సమీపంలో కూర్చుకున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి.

  దీంతో పులిని పట్టుకునేందుకు తలుపు తెరిచే ముందే అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చుట్టూ వల (Net) వేశారు. అలాగే ఓ బోనును సమీపంలోనే ఉంచుకున్నారు. వెటర్నరీ డాక్టర్​ను పిలిపించారు.

  అన్ని చర్యలు తీసుకున్నాక బాత్​రూమ్ పైన షీట్​కు హోల్ చేసి.. పులిని బయటకు రప్పించాలన్నది ప్లాన్​. అందుకు తగ్గట్టుగానే షీట్​ను తొలగించగానే పులి ఆ గోడపై నుంచి దూకింది. దీంతో ఆ పులి వలలో పడింది. తలుపు తెరిచి చూడగా.. కుక్కకు ఒక్క గాయం కూడా కాలేదు. ఇక బయటకి వచ్చిన ఆ శునకానికి ఆ కుటుంబ సభ్యులు ఆహారం పెట్టారు. ఒకవేళ మళ్లీ పులులు వస్తాయేమోన్న ముందు జాగ్రత్తగా చర్యగా ఆ ఫామ్​ హౌస్​లో అటవీ శాఖ అధికారులు రెండు బోన్లను సిద్ధం చేశారు.

  కాగా ఈ పులి, కుక్క స్టోరీని ఫొటోతో సహా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్వీట్ చేశారు. “ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుంది. ఓ గదిలో పులితో పాటు గంటల పాటు కుక్క చిక్కుకుపోవడాన్ని ఊహించండి. అది ఇంకా జీవించే ఉంది” అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  Published by:Krishna P
  First published:

  Tags: Dog, Leopard

  ఉత్తమ కథలు