హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dog: కుక్క మొరుగుతుందని దాన్ని ఏం చేశాడో తెలుసా..? ఛీ.. ఛీ.. మనిషేనా

Dog: కుక్క మొరుగుతుందని దాన్ని ఏం చేశాడో తెలుసా..? ఛీ.. ఛీ.. మనిషేనా

కుక్కను తీవ్రంగా కొట్టిన ఖుద్దూస్‌ హుస్సేన్‌

కుక్కను తీవ్రంగా కొట్టిన ఖుద్దూస్‌ హుస్సేన్‌

అది అరిచిందని.. మొరిగిందని విచక్షణ మరిస్తే ఎలా..? మనుషులు క్రూరంగా మారిపోతున్న రోజులివి.. సాటి మనిషినే ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న కాలమిది.. మనుషులపైనే ఈ హింస చాలదన్నట్లు కుక్కలపై ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు..

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

కుక్కలు మొరుగుతాయి..అది వాటి నైజం.. దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ.. మన పని మనం చేసుకుంటూ వెళ్తే అదే కాసేపటికి అరవడం ఆపేస్తుంది.. మనం రాయి తీసుకొని విసిరిమా... అంతే సంగతులు.. ఇంకా కోపంతో మీదకు వస్తుంది.. కొన్ని కరుస్తాయి.. కొన్ని భయపెట్టి వెళ్లిపోతాయి.. రోడ్లపై వేలల్లో వీధి కుక్కలు.. దాడి చేసేవి మాత్రం ఫింగర్స్‌పై లెక్క పెట్టేనన్ని మాత్రమే.. ఈ మధ్య కాలంలో మనుషులపై శునకాల దాడులు పెరిగాయి కానీ.. సాధారణంగా మనుషులకు అత్యంత విశ్వాసంగా ఉండే జీవులు కుక్కలే.. అది అరిచిందని.. మొరిగిందని విచక్షణ మరిస్తే ఎలా..? మనుషులు క్రూరంగా మారిపోతున్న రోజులివి.. సాటి మనిషినే ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న కాలమిది.. మనుషులపైనే ఈ హింస చాలదన్నట్లు కుక్కలపై ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు..

మొరుగుతుందని విచక్షణ మరిచి కొట్టాడు:

రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్ జిల్లా- ఖిల్చిపూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఖుద్దూస్ హుస్సేన్ అనే వ్యక్తి ఓ కుక్కను అత్యంత దారుణంగా కొట్టాడు. రోడ్డుపై నడుస్తూంటే కుక్క తనని చూసి మొరిగిందని ఆగ్రహంతో ఊగిపోయిన ఖుద్దూస్‌ హుస్సేన్‌.. తన ఇంట్లోకి వెళ్లి పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చాడు.. కుక్కపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.. కర్రలతో చావబాదాడు.. కుక్క కిందామీదా పడి గిలగిలా కొట్టుకుని ఏడుస్తున్నా కనీకరించలేదు.. అది కిందపడిన తర్వాత మరింత క్రూరంగా ప్రవర్తించాడు.. కుక్క నోట్లో కర్ర పెట్టి మరీ ఇష్టారీతిన చావగొట్టాడు. కుక్క అరుపులు విన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని ఖుద్దూస్‌ను ఎలాగోలా అడ్డుకున్నారు. అయితే కుక్క అప్పటికీ తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఖుద్దీస్‌ ప్రవర్తనపై స్థానికులు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు:

కుక్కలు అరుస్తున్నాయని.. మొరుగుతున్నాయని.. వెనక వస్తున్నాయని.. గతంలోనూ వాటిపై అనేక దాడులు జరిగాయి. పొరిగింటి పెంపుడు కుక్క అరిచిందని దాన్ని చంపేసిన ఘటనలూ ఉన్నాయి.. కుక్క అరుస్తుందని మూతికి టేప్ వేసిన వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. రాత్రి వేళ వీధి కుక్కలు అరవకుండా ఉండేందుకు విషప్రయోగం చేసిన దొంగలు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో కుక్కల విషయంలో దేశవ్యాప్తంగా విపరీతంగా చర్చలు జరగుతున్నాయి. హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది.. ముఖ్యంగా సోషల్‌మీడియాలో జంతు ప్రేమికులపై ఓ వర్గం ప్రజలు మాటల దాడి పెంచారు.. అటు జంతు ప్రేమికులు సైతం అసలు విషయాన్ని, సమస్యను పాయింట్ చేయకుండా ట్వీట్లకు రివర్స్‌ అటాక్‌ చేస్తూ కాలం గడుపుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.. రెండు వర్గాల్లోనూ క్రూరమైనా మాటలే తప్ప.. అసలు సమస్య గురించి చర్చే లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Rajasthan, Stray dogs

ఉత్తమ కథలు