• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • DOG MEMORIAL AND CEMETERY HAVE BEEN SET UP FOR SNIFFER DOGS IN KERALA SSR GH

Kerala Police: ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కేరళ పోలీసు శాఖ.. జాగిలాల కోసం మెమోరియల్​ ఏర్పాటు

ప్రతీకాత్మక చిత్రం

నేరస్థులను గుర్తించడంలో కీలకంగా పనిచేసే జాగిలాల విషయంలో కేరళ పోలీస్​ శాఖ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో చనిపోయిన జాగిలాల కోసం ప్రత్యేక స్మశాన వాటికలు, అడోగ్ మెమోరియల్​ను కూడా ఏర్పాటు చేసింది. త్రిశూర్‌లోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ మెమోరియల్​ను ఆ రాష్ట్ర డిజిపి, రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్నాథ్ బెహెరా జూన్ 20న ప్రారంభించారు.

  • Share this:
నేరస్థులను గుర్తించడంలో కీలకంగా పనిచేసే జాగిలాల విషయంలో కేరళ పోలీస్​ శాఖ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో చనిపోయిన జాగిలాల కోసం ప్రత్యేక స్మశాన వాటికలు, అడోగ్ మెమోరియల్​ను కూడా ఏర్పాటు చేసింది. త్రిశూర్‌లోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ మెమోరియల్​ను ఆ రాష్ట్ర డిజిపి, రాష్ట్ర పోలీసు చీఫ్ లోక్నాథ్ బెహెరా జూన్ 20న ప్రారంభించారు. చనిపోయిన జాగిలాల సమాధుల వద్ద డిజిపి బెహెరా పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీనిపై సీనియర్​ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ “నేరస్థులను గుర్తించడానికి, దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉపయోగించే జాగిలాల సంస్మరణార్థం ఈ మెమోరియల్‌ను ఏర్పాటు చేశాం. జాగిలాల కోసం మెమోరియల్​​, స్మశానవాటిక ఏర్పాటు చేయడం ఆసియాలోనే ఇది మొట్టమొదటిసారి. కేరళ పోలీసు శాఖ దీనికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.

కొత్తగా నిర్మించిన ఈ స్మారక స్థలాన్ని జాగిలాలను ఖననం చేయడానికి, గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సేవలో మరణించిన పోలీసులకే కాదు జాగిలాలను కూడా గౌరవించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మెమోరియల్ సైట్​లో మొత్తం 10 సమాధులను నిర్మించారు. ప్రతి సమాధిని గ్రానైట్, స్టోన్​ స్లాబ్స్​, టేక్​ వుడ్​ బోర్డ్​తో తయారు చేశారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా వీటిని వృత్తాకార పద్ధతిలో డిజైన్​ చేశారు. మృతదేహాన్ని ఉంచడానికి మధ్యలో గోతులు ఏర్పాటు చేశారు. ప్రతి సమాధి వద్ద ఉన్న గ్రానైట్​పై కుక్క పేరు చెక్కారు. అంతేకాదు, ప్రతి సమాధి పైభాగంలో ఒక సైప్రస్ చెట్టును కూడా నాటారు. ఈ మెమోరియల్​ను​ పది సెంట్ల స్థలంలో నిర్మించినట్లు కేరళ పోలీస్​ శాఖ వెల్లడించింది. కాగా, ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

* ఆసియాలోనే తొలి డాగ్​ మెమోరియల్​..
జాగిలాల గౌరవార్థం మెమోరియల్‌తో పాటు రిటైర్​ అయిన కుక్కల కోసం విశ్రాంతి భవనాన్ని కూడా అకాడమీలోనే నిర్మించారు. కేరళ కే9 స్క్వాడ్​గా పిలిచే ఈ కుక్కలు తుదిశ్వాస విడిచే వరకు అక్కడే వాటికి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఈ విశ్రాంతి భవనాన్ని 2019లో డిజిపి బెహెరా చొరవతో నిర్మించారు. వాటి వినోద కార్యకలాపాల కోసం ప్రత్యేక గది, తోట, ఈత కొలను వంటి సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం కేరళ పోలీస్​ అకాడమీలో రిటైర్​మెంట్​ అయిన కుక్కలు మొత్తం 19 ఉన్నాయి. వీటి సంరక్షణ కోసం పశువైద్యులను కూడా నియమించారు. వాటి బరువు, ఎత్తు ప్రకారం, వైద్యులు సమతుల్య ఆహారాన్ని సూచిస్తారు. కాగా, ఈ K9 స్క్వాడ్​ డాగ్స్​ కేరళ పోలీస్ టాస్క్​ఫోర్స్​ విభాగంలో గత 60 ఏళ్ల నుంచి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, ఈ విభాగంలో మొత్తం 82 కుక్కలు ఉన్నాయి. వాటిలో సగం స్నిఫర్ డాగ్స్​ ఉండగా.. మిగతా సగం ట్రాకర్ డాగ్స్ ఉన్నాయని కేరళ పోలీసు శాఖ వెల్లడించింది. ఏదేమైనప్పటికీ, జాగిలాలకు మెమోరియల్​ ఏర్పాటు చేయడం ద్వారా కేరళ పోలీస్​ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Published by:Sambasiva Reddy
First published: