Variety Dog: పాలు వద్దు.. మాంసం వద్దు.. కర్రలే తింటున్న కుక్క.. వీడియో

కర్రను తింటున్న కుక్క

ఈ కుక్కకు ఎన్ని రుచికరమైన, పోషకాహారాలు పెట్టినా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటోంది. అదే కర్ర కనిపిస్తే చాలా పరిగెత్తుకుంటూ వచ్చి.. కరకరా నమిలేస్తుంది.

  • Share this:
    సాధారణంగా కుక్కలు ఏం తింటాయి. పాలు, మాంసంతో పాటు మనం తినే అన్నాన్ని ఎక్కువగా లాగిస్తాయి. ఇక మార్కెట్లో దొరికే పెడిగ్రీ వంటి పోషకాహారాన్ని క్షణాల్లో హాం ఫట్ చేస్తాయి. కానీ ఓ కుక్క మాత్రం ఇవేవీ వద్దంటుంది. తనకు కర్రలు, చెక్కలు ఉంటే చాలంటోంది. ఎన్ని రుచికరమైన, పోషకాహారాలు పెట్టినా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటోంది. అదే కర్ర కనిపిస్తే చాలా పరిగెత్తుకుంటూ వచ్చి.. కరకరా నమిలేస్తుంది. ఈ వెరైటీ డాగ్ ఎక్కడుందో తెలుసా..? బీహార్‌ని ముజఫర్‌పూర్‌లో ఈ కుక్క ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

    ముజఫర్‌పూర్‌కు చెందిన వ్యాపారి సంజీవ్ చౌధరి, గుంజన్ భార్య భర్తలు. వీరికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ఇక పెంపుడు జంతువులంటే అమితమై ప్రేమ. వీరింట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దాన్ని సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారు. గుంజన్‌కైతే దీనితోనే టైం పాస్. ఇంట్లో అన్ని పనులను పూర్తి చేసుకున్న తర్వాత తనకు ఇష్టమైన కుక్కతోనే ఆడుకుంటూ గడుపుతుంది. అది కూడా ముద్దులు పెడుతూ ఎంతో ముచ్చటగా అల్లరి చేస్తుంది. ఐతే ఈ కుక్కకు విచిత్ర అలవాటు ఉంది. అన్ని కుక్కల్లా పాలు, మాంసం, అన్నం తినకుండా కర్రలు తింటోంది.



    ఈ కుక్క మొదట్లో కర్రలు తినడం చూసి సంజీవ్ దంపతులు కంగారు పడ్డారు. గట్టిగా ఉండే కర్రను కొరికితే దాని దంతాలు ఊడిపోతాయేమోనని ఆందోళన చెందారు. కానీ క్రమ క్రమంగా పెద్ద పెద్ద కర్రలు తిన్నా.. ఏం కాలేదు. పైకా సాధారణ ఆహార పదార్థాల కంటే కలపనే ఇష్టంగా తింటోంది. కర్రలను నములుతూ టైం పాస్ చేస్తుంది. ఇలాంటి జంతువులు చాలా అరుదుగా ఉంటాయని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. కలప తినడం వలన ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. కానీ మరీ ఎక్కువగా తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: