హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rare Treatment: చిన్నారికి అరుదైన ఫ్రోజెన్ ట్రీట్‌మెంట్.. కొత్త పద్ధతిలో ప్రాణాలు కాపాడిన వైద్యులు

Rare Treatment: చిన్నారికి అరుదైన ఫ్రోజెన్ ట్రీట్‌మెంట్.. కొత్త పద్ధతిలో ప్రాణాలు కాపాడిన వైద్యులు

Rare Treatment: చిన్నారికి అరుదైన ఫ్రోజెన్ ట్రీట్‌మెంట్.. కొత్త పద్ధతిలో ప్రాణాలు కాపాడిన వైద్యులు

Rare Treatment: చిన్నారికి అరుదైన ఫ్రోజెన్ ట్రీట్‌మెంట్.. కొత్త పద్ధతిలో ప్రాణాలు కాపాడిన వైద్యులు

Rare Treatment: ఇండియన్ మెడికల్ హిస్టరీలో ఒక అరుదైన సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు ఫ్రీజింగ్ పద్ధతిని ఫాలో అయ్యారు. చనిపోయే దశకు చేరుకున్న చంటిబిడ్డ ప్రాణాలను కాపాడారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్ మెడికల్ హిస్టరీ (Indian Medical History)లో ఒక అరుదైన సంఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు (Doctors) ఫ్రీజింగ్ పద్ధతి (Freezing Method) ని ఫాలో అయ్యారు. బేబీ బాడీ టెంపరేచర్‌ను కృత్రిమ పద్ధతిలో భారీగా తగ్గించి, చనిపోయే దశకు చేరుకున్న చంటిబిడ్డ ప్రాణాలను కాపాడారు. ఈ పసికందు సుప్రా వెంట్రిక్యులర్ టాకీకార్డియా (Supraventricular Tachycardia) అనే ఒక అనారోగ్య సమస్యతో జన్మించింది. ఈ మెడికల్ కండిషన్ కారణంగా పిల్లల గుండె అసాధారణమైన వేగంతో కొట్టుకుంటుంది. దీనివల్ల గుండె ఆగిపోయి మరణం సంభవిస్తుంది. అయితే ఆ పరిస్థితి రాకుండా బెంగళూరులోని మదర్‌హుడ్ హాస్పిటల్స్ వైద్యులు చంటి పాపాయిని కాపాడారు.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జూన్ 29న ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అనంతపురంలోని ఆసుపత్రిలో ఒక పాప పుట్టింది. ఈ చిన్నారి గుండె సాధారణ పిల్లల కంటే దాదాపు రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలైంది. దాంతో స్థానిక వైద్యులు ఈ బాలికను బెంగుళూరులోని మదర్‌హుడ్ హాస్పిటల్స్‌లో చూయించాలని సూచించారు.

వారి సూచన మేరకు తల్లిదండ్రులు వెంటనే బాలికను అక్కడికి తరలించారు. మదర్‌హుడ్ హాస్పిటల్స్‌లోని నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషియన్ డా.ప్రతాప్ చంద్ర ఈ బాలిక కేసును టేకప్ చేశారు. ఈ చిన్నారి పేరు అన్యా. అన్యా చికిత్సలో భాగంగా గుండె ఆగిపోకుండా ఆమెను గడ్డకట్టే చలిలో ఉంచారు. ఈ పద్ధతిని మెడికల్ పరిభాషలో 'టోటల్ బాడీ కూలింగ్ ట్రీట్‌మెంట్' అంటారు.

* చికిత్స ఎలా కొనసాగింది

చిన్నారికి చికిత్స చేసేందుకు మొదటగా చిక్కబళ్లాపూర్‌లోని మదర్‌హుడ్ హాస్పిటల్స్‌లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) బృందం ముందుకొచ్చింది. మదర్‌హుడ్ ఎన్‌ఐసీయూ అంబులెన్స్‌లోనే హృదయ స్పందన రేటును తగ్గించడానికి బిడ్డకు మూడు డోస్‌ల అడెనోసిన్‌ను అందించింది.

దీనికి అన్యా స్పందించలేదు. ఆ తర్వాత ఆమెను బెంగుళూరులోని మదర్‌హుడ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమెకు మరో మూడు మందులు ఇచ్చారు. కార్డియాక్ ఎకో, ECG, రక్త పరీక్షలతో సహా మరిన్ని ట్రీట్‌మెంట్స్ ఇచ్చి పరిస్థితిని నార్మల్ చేసేందుకు ట్రై చేశారు కానీ ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత ఆమెకు షాక్ కూడా ఇచ్చారు. అప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచి ముగ్గురు విద్యార్థినులు పరార్.. భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధమైన ఇద్దరు అమ్మాయిలు..!

చివరగా, యూకేలో ఇలాంటి ఒక కేసులో టోటల్ బాడీ కూలింగ్ ట్రీట్‌మెంట్‌ను ఉపయోగించారని డాక్టర్లు తెలుసుకున్నారు. ఈ పద్ధతి ఉపయోగించేందుకు కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకున్నారు. అనంతరం ఆ పాపను ఒక జాకెట్‌లో ఉంచి చల్లబరిచారు. ఆమె ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 33.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించారు. చివరికి అన్యా హార్ట్ బీట్ రేటును సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అలా బాలికను కాపాడడంలో డాక్టర్లు విజయం సాధించారు. వారం రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

* ఫ్రీజింగ్ పద్ధతి

సాధారణంగా టోటల్ బాడీ కూలింగ్ ట్రీట్‌మెంట్ అనే ఫ్రీజింగ్ పద్ధతిని పిల్లలు పుట్టినప్పుడు ఏడవకపోతే, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే ఉపయోగిస్తారు. కాగా బెంగళూరు డాక్టర్స్‌ గుండె వేగాన్ని తగ్గించేందుకు కూడా ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. సుప్రా వెంట్రిక్యులర్ టాకీకార్డియా కారణంగా హృదయ స్పందన నిమిషానికి 250 వరకు పెరిగిపోతుందట. అప్పుడే పుట్టిన పాపాయిలకు నార్మల్ హార్ట్ బీట్ నిమిషానికి 120-160 బీట్స్ మధ్య ఉంటుంది. అంతకుమించితే వారిని ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Andhra Pradesh, Bengaluru, Doctors, VIRAL NEWS

ఉత్తమ కథలు