నీట్-పీజీ కౌన్సెలింగ్లో జాప్యంపై వివిధ ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులు నిరసన (ANI)
Doctors Strike | ఢిల్లీ (Delhi) లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన రెసిడెంట్ వైద్యులు, నీట్-పీజీ కౌన్సెలింగ్లో పదేపదే ఆలస్యాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మార్చ్ నిర్వహించారు. ఈ నిరసనను అడ్డుకొనేందకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీనిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను నిలిపివేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.
ఢిల్లీ (Delhi) లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన రెసిడెంట్ వైద్యులు, నీట్-పీజీ కౌన్సెలింగ్లో పదేపదే ఆలస్యాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మార్చ్ నిర్వహించారు. ఈ నిరసనను అడ్డుకొనేందకు పోలీసులు (Police) లాఠీచార్జీ చేశారు. దీనిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను నిలిపివేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. డిసెంబర్ 29, 2021 ఉదయం 8 గంటల నుంచి సేవల నిలిపివేత అమలులోకి వస్తుందని స్పష్టంచేశారు. ఈ ఘటనలో పోలీసులు వైద్యులపై అల్లర్లు, విధులకు ఆటంకం కలిగించారు అనే అంశాలపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏం జరిగింది..
NEET-PG 2021 కౌన్సెలింగ్లో జాప్యంపై ఢిల్లీలో పెద్ద సంఖ్యలో రెసిడెంట్ వైద్యులు నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు, వైద్యులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అదే సమయంలో, పోలీసుల బలప్రయోగానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి (Hospital) లో వేలాది మంది వైద్యుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అధికారిక నివాసం వరకు వేలాది మంది వైద్యులు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. పెద్ద సంఖ్యలో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సరోజినీ నగర్ పోలీస్స్టేషన్ ఎదుట పెద్ద సంఖ్యలో రెసిడెంట్ వైద్యులు గుమిగూడారని, అయితే పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
“కోవిడ్ యోధులకు గౌరవం లేదు. ఈరోజు ఏమి జరిగిందో చూసి మేము షాక్ అయ్యాము మరియు అవిశ్వాసంలో ఉన్నాము. మగ, మహిళా వైద్యులను రోడ్డుపైకి లాగారు. చాలా మంది గాయపడ్డారు, కొందరికి లాగడం వల్ల గాయాలు ఉన్నాయి, మరికొందరికి బారికేడ్లకు తగిలింది, మరికొందరికి బస్సు డోర్ మూసివేయడంతో వారి చేతికి గాయాలయ్యాయి, ”అని రెసిడెంట్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనూజ్ అగర్వాల్ ఆరోపించారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఇటీవల ప్రవేశపెట్టిన కోటాపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా కౌన్సెలింగ్ (Counseling) లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాతినథ్యం వహిస్తోంది. ఈ సమ్మెను పోలీసులు అడ్డుకొన్నారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది వైద్యులను ITO సమీపంలో నిర్బంధించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.