దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి.. రోగి కడుపులో నుంచి రెండు పెద్ద కణితులను తొలగించారు. ఈ రెండు కణతుల బరువు 25 కిలోల 500 గ్రాములు. అంత పెద్ద కణతులను చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.
ఓ యువకుడికి కడుపు నొప్పి (Stomach Pain)వచ్చింది. మలవిసర్జన కూడా ఆగిపోయింది. మనం రెండు రోజులు మలవిసర్జన చేయపోతేనే ఇబ్బందిపడతాం. కానీ అతడు వారం పది రోజులుగా ఈ సమస్యతో అల్లాడిపోతున్నాడు. కడుపు ఉబ్బిపోవడం..మలవిసర్జన లేకపోవడం వల్ల.. విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మొదట్లో చిన్న సమస్యే అనుకున్నాడు. కానీ రోజులు గడిచేకొద్ది.. భరించలేనంత నొప్పి వేధించింది. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. స్కానింగ్ చేస్తే.. కడుపులో ఏం సమస్య ఉందో అర్ధ కాదని భావించిన డాక్టర్లు.. అతడిని స్కానింగ్ చేశారు. స్కానింగ్ ద్వారా ఉదర అంతర్భాగాలను చూసి.. వారు షాక్ తిన్నారు. ఇంతకి అతడికి ఏమైంది? కడుపులో ఏముంది? ప్రస్తుతం ఎలా ఉన్నాడు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని బీర్భూమ్ జిల్లా ఖైరాషోల్లో నివాసం ఉంటున్న జగబంధు హల్దార్ (38) కడుపు సమస్యలతో బాధపడుతున్నాడు. గత సోమవారం బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ( Burdwan medical college)లోని అత్యవసర విభాగానికి వచ్చారు. అతడికి పరీక్షలు చేసిన వైద్యులు.. ప్రేగుల్లో కదలికలు ఆగిపోయినట్లు గుర్తించారు. అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోవాలని అత్యవసర విభాగం వైద్యుడు సూచించారు. జగబంధుకు 'అల్ట్రాసోనోగ్రఫీ' టెస్ట్ చేసిన వైద్యులు..పేగుల లోపలి దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. అన్నవాహిక రెండు పెద్ద కణితులు అన్నవాహికలో అడ్డుగా ఉన్నాయి. వెంటనే జగబంధుబాబుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శస్త్రచికిత్స ప్రారంభమైంది. దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి.. రోగి కడుపులో నుంచి రెండు పెద్ద కణితులను తొలగించారు. ఈ రెండు కణతుల బరువు 25 కిలోల 500 గ్రాములు (Doctors Removed 25 kg tumor from a man stomach). అంత పెద్ద కణతులను చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.
బుర్ద్వాన్ మెడికల్ కాలేజీలో సర్జన్ అయిన శివ్రజిత్ గంగోపాధ్యాయ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆయనతో పాటు మరో నలుగురు వైద్యులు కూడా ఉన్నారు. "జగబంధు కడుపులో ఉన్న ఈ భారీ కణితులు మొత్తం అన్నవాహిక పనితీరుకు ఇబ్బందిని కలిగించాయి. శస్త్రచికిత్స తర్వాత అతను బాగానే ఉన్నాడు. ఐసియులో ఉంచాం. ప్రస్తుతానికి పళ్ల రసాలు, రాగిజావా వంటి ద్రవ ఆహారపదార్థాలు తీసుకుంటున్నాడు. " అని డాక్టర్ శివ్రజిత్ గంగోపాధ్యాయ చెప్పారు. ఆపరేషన్ విజయవంతమయినందుకు సంతోషంగా ఉందని.. బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ తపస్ ఘోష్ తెలిపారు. జగబంధు హద్వార్కు వైద్యులు త్వరితగతిన వ్యాధిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేరని వెల్లడించారు. ఇంత పెద్ద కణతికి సంబంధించిన ఇటీవల కాలంలో చేయలేదని.. ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.