హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి వైద్యులు 50 ఏళ్ల రోగికి కీహోల్ ద్వారా రికార్డు స్థాయిలో 156 కిడ్నీలో రాళ్లను తొలగించినట్లు ప్రకటించారు. వైద్యులు పెద్ద శస్త్రచికిత్సకు బదులుగా లాపరోస్కోపీ, ఎండోస్కోపీని ఉపయోగించారు. ఈ విధానాన్ని ఉపయోగించి దేశంలో ఒక రోగి నుండి అత్యధిక సంఖ్యలో రాళ్లను తొలగించడం ఇదే. ఇది దాదాపు మూడు గంటల పాటు ఈ సర్జరీ కొనసాగింది. చికిత్స చేయించుకున్న రోగి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అతని సాధారణ స్థితికి వచ్చాడని తెలిపారు. హుబ్లీ నుండి వచ్చి రోగి.. ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్‌లో చేరాడు.
వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయుడైన బసవరాజ్ మడివాలర్‌కు పొత్తికడుపు దగ్గర అకస్మాత్తుగా నొప్పి వచ్చింది. స్క్రీనింగ్‌లో మూత్రపిండంలో పెద్ద ఎత్తున రాళ్లు ఉన్నట్లు తేలింది.
రోగి మూత్ర నాళంలో సాధారణ స్థితికి బదులుగా అతని పొత్తికడుపుకు సమీపంలో ఉన్నందున రోగికి ఎక్టోపిక్ కిడ్నీ కూడా ఉందని వైద్యులు తెలిపారు. అసాధారణ ప్రదేశంలో మూత్రపిండము ఉండటం సమస్యకు కారణం కానప్పటికీ, అసాధారణంగా ఉన్న కిడ్నీ నుండి రాళ్లను తొలగించడం ఒక సవాలుతో కూడుకున్న పని అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
Cats Ban: ఆ దేశంలో పెంపుడు పిల్లులపై నిషేధం.. అదే కారణం.. జంతు ప్రేమికులు ఆగ్రహం
Lions: ఎయిర్‌పోర్టు సమీపంలో షికారు చేసిన సింహాలు.. అసలేం జరిగిందంటే..
"ఈ రోగి శరీరంలో రెండు సంవత్సరాల నుంచి రాళ్లు పెరుగుతూ ఉండొచ్చు. కానీ గతంలో ఎన్నడూ ఎలాంటి లక్షణాలను కనిపించలేదు. అయితే నొప్పి ఆకస్మికంగా రావడంతో అవసరమైన అన్ని పరీక్షలను చేయవలసి వచ్చింది. ఇది మూత్రపిండాల రాళ్ల పెద్ద క్లస్టర్ ఉనికిని వెల్లడించింది. అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత పెద్ద శస్త్రచికిత్సకు బదులు రాళ్లను వెలికితీసేందుకు లాపరోస్కోపీ, ఎండోస్కోపీ మార్గాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం" అని ఆసుపత్రి యూరాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి చంద్రమోహన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kidney