వ్యక్తి కడుపులో తాళం చెవులు, నాణేలు, పైపులు.. ఎలా వెళ్లాయో తెలుసుకొని డాక్టర్లు షాక్

Rajasthan News: తాళం చెవులు, నాణేలు, పైపులు మింగేశాడు. మొత్తం 80కిపైగా ఇనుప వస్తువులను ఆయన తన కడుపులో దాచుకున్నాడు.

news18-telugu
Updated: June 18, 2019, 1:56 PM IST
వ్యక్తి కడుపులో తాళం చెవులు, నాణేలు, పైపులు.. ఎలా వెళ్లాయో తెలుసుకొని డాక్టర్లు షాక్
వ్యక్తి కడుపు నుంచి 80 రకాల వస్తువులను ఆపరేషన్ చేసి తీసిన వైద్య బృందం (ANI Twitter Photo)
  • Share this:
మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి తనకు తెలీకుండానే ఏ వస్తువు కనిపిస్తే ఆ వస్తువులు తినడం ప్రారంభించాడు. అలా తాళం చెవులు, నాణేలు, పైపులు మింగేశాడు. మొత్తం 80కిపైగా ఇనుప వస్తువులను ఆయన తన కడుపులో దాచుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఏడవడంతో కుటుంబ సభ్యులు ఏం జరిగిందోనని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్ రే తీసి వైద్యులు షాక్ అయ్యారు. అతడి కడుపులో 80 రకాల ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. నలుగురు డాక్టర్ల బృందం 90 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి వాటన్నింటినీ బయటకు తీశారు. దీనిపై ఆపరేషన్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. రోగి మానసికంగా బాధపడుతున్నాడని, అతడు అలాగే పైపులు, కాయిన్స్ తిని ఉంటే చనిపోయేవాడని, పరిస్థితి విషమించకముందే అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
First published: June 18, 2019, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading