హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇదేందిరా నాయన... ఏడాదిగా స్పూన్ లను తింటున్న యువకుడు.. ఎక్కడో తెలుసా..?

ఇదేందిరా నాయన... ఏడాదిగా స్పూన్ లను తింటున్న యువకుడు.. ఎక్కడో తెలుసా..?

పొట్టలో నుంచి బైటకు తీసిన స్పూన్ లు

పొట్టలో నుంచి బైటకు తీసిన స్పూన్ లు

Viral news: యువకుడు కొన్నిరోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఇప్పటి వరకు మనం చిన్న పిల్లలు పొరపాటున కాయిన్ లు, ఆటవస్తువులు మింగడం లాంటిది చూశాం. మరికొన్ని సార్లు.. వెంట్రుకలను కూడా కొందరి కడుపులో బయటపడటం వార్తలలో చూశాం. కొంత మంది స్మగ్లింగ్ చేసే క్రమంలో గోల్గ్ బిస్కట్ లను కూడా కడుపులో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తునే ఉంటాం. అయితే... ఇక్కడోక వ్యక్తి ఏడాదిగా స్పూన్ లను తిన్నాడు. ఈ ఘటన కాస్త వైరల్ గా (Viral news)  మారింది.

పూర్తి వివరాలు... ఉత్తరప్రదేశ్ లోని (Uttar pradesh)  వింత ఘటన వార్తలలో నిలిచింది. ముజఫర్ నగర్ లోని 32 ఏళ్ల యువకుడు కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు.. అతడి కడుపును స్కానింగ్ చేయగా షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. కాగా, ముజఫర్ నగర్ లోని బొప్పాడ గ్రామంలో నివసించే విజయ్ అనే వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆధారఫడ్డాడు. అయితే.. అతడి కడుపులో స్పూన్ లను ఉండటాన్ని డాక్టర్ లు చూసి షాక్ కు గురయ్యారు.

ఆ తర్వాత.. ఎండోస్కోపిక్ ను నిర్వహించి అతని కడుపులో నుంచి దాదాపు 62 స్పూన్ లను బైటకు తీశారు. ఆ తర్వాత అతడిని అత్యవసర విభాగంలో ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై యువకుడి కుటుంబసభ్యులను కారణం అడగ్గా.. విజయ్.. కొన్నిరోజుల నుంచి వ్యక్తిగత కారణాల వలన ఒక్కడే ఉంటున్నాడని, నిరాశ స్థితిలో ఉంటున్నాడని అందుకే ఇలా చేసుంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ కు (chhattisgarh)  చెందిన యువకుడు బైక్ మీద వేసిన స్టండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యువకుడు బైక్ మీదకూర్చుని ఒక చేత్తో వెహికిల్ ను కంట్రోల్ చేస్తు మరోచేతితో వెహికిల్ ను నడిపిస్తున్నాడు. అతను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు.  స్పీడ్ గా డెంజరేస్ గా వెళ్తున్నాడు. అతని చుట్టుపక్కల మరికొన్ని వెహికిల్స్ కూడా రోడ్డుపైన వెళ్తున్నాయి. వారుఇతడిని వింతగా చూస్తున్నారు.

ఇంతలో ట్రాఫిక్ పోలీసులు ఇతగాడిని పట్టుకున్నారు. వెంటనే స్టేషన్ కు తీసుకెళ్తారు. అక్కడ రాంగ్ రూట్, స్టంట్ లు వేసినందుకు ఫైన్ వేశారు. గుంజీలు కూడా తీయించారు. ఆ తర్వాత.. పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతాలతో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు