• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DOCTOR HEALTH SERVICES FOR POOR PEOPLE IN ODISHAS SAMBALPUR SK

1 Rupee Doctor: ఒక్క రూపాయికే వైద్య చికిత్స.. ఈయన వైద్యుడు కాదు దేవుడు..

1 Rupee Doctor: ఒక్క రూపాయికే వైద్య చికిత్స.. ఈయన వైద్యుడు కాదు దేవుడు..

డాక్టర్ర శంకర్ రామచందని

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మంచి ఆశయంతో శంకర్ రామచందని.. బుర్లా పట్టణంలో క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారమే ఈ వన్ రూపీ క్లినిక్ ప్రారంభమయింది. తొలి రోజు 33 మంది రోగులకు ఆయన ట్రీట్‌మెంట్ చేశారు.

  • Share this:
    ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే చికిత్స కోసం వేలకు వేలు ఖర్చు చేయాలి. పరీక్షలు, వైద్య సేవలు, మందులు అన్నీ కలిపితే బోలెడన్ని డబ్బులు ఖర్చవుతాయి. ప్రభుత్వాస్పత్రికి వెళ్దామంటే కొన్ని చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణం పోతున్నా అస్సలు పట్టించుకోరు. అందుకే డబ్బులు ఖర్చయినా ప్రైవేట్‌ ఆస్పత్రులకే ఎక్కువ మంది వెళ్తుంటారు. ఐతే వేలు, లక్షల్లో వైద్య ఖర్చులయ్యే ఈ కాలంలో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రి మాత్రం కేవలం ఒక్క రూపాయికే వైద్యం చేస్తోంది. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఈ పేదోడి క్లినిక్ ఉంది. ఇటీవలే ఆస్పత్రి ప్రారంభమయింది. కేవలం ఒక్క రూపాయికే ఇక్కడ చికిత్స అందజేస్తున్నారు.

    38 ఏళ్ల శంకర్ రామచందని అనే డాక్టర్.. వీర సురేంద్రసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శిఖా రామచందని డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఐతే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మంచి ఆశయంతో శంకర్ రామచందని.. బుర్లా పట్టణంలో క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారమే ఈ వన్ రూపీ క్లినిక్ ప్రారంభమయింది. తొలి రోజు 33 మంది రోగులకు ఆయన ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఆస్పత్రి గురించి పట్టణంలో అందరికీ తెలియడంతో ఇప్పుడిప్పుడే రోగుల రాక పెరుగుతోంది. ఒక్క రూపాయికి ఏం వైద్యం చేస్తాడని అనుకుంటే పొరపాటే. ఎందుకుంటే వేల రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ క్లినిక్స్ కంటే మంచి వైద్యం అందిస్తున్నారు శంకర్ రామచందని. ఆయన భార్య శిఖా కూడా సాయం చేస్తున్నారు.

    '' VISMARలో నేను రెసిడెంట్ డాక్టర్‌గా జాయిన్ అయ్యాను. ఐతే రెసిడెంట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు. అందుకే అప్పుడు నేను వన్ రూపీ క్లినిక్‌ను ప్రారంభించలేకపోయాను. కానీ ఇటీవల నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఇటీవలే ఓ అద్దె ఇల్లు తీసుకొని ఒక్క రూపాయి క్లినిక్‌ను ప్రారంభించాను. పేదలకు ఒక్క రూపాయికే వైద్యం సేవలు అందిస్తున్నా. ఉచితంగా వైద్యం అందిస్తున్నాడని భావించకుండా ఉండేందుకే ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుంటున్నా.'' అని శంకర్ రామచంద పేర్కొన్నారు.

    బుర్లా పట్టణంలోని కచ్చా మార్కెట్‌లో ఉన్న ఈ ఆస్పత్రి రోజుకు రెండు గంటలు తెరిచి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు రోగులకు ట్రీట్‌మెంట్ ఇస్తారు.


    VISMARలో ఎంతో మంది రోగులు డాక్టర్ కన్సల్టేషన్ కోసం క్యూకడతారని.. వికలాంగులు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉంటారని శంకర్ తెలిపారు. అలాంటి వారంతా అక్కడ వెయిట్ చేయాల్సిన పనిలేదు.. మా క్లినిక్‌కు వచ్చిన ఒక్క రూపాయికే వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేయాల్సిందిగా తన తండ్రి చెప్పారని.. కాని దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుందని తెలిపారు. అప్పుడు ఒక్క రూపాయికి వైద్య సేవలు అందించలేనని .. అందుకే చిన్న క్లినిక్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలో ఎంతో మంది రోగులను తన సొంత కారులో ఆస్పత్రికి తరలించి ప్రశంసలు అందుకున్నారు శంకర్ రామచందని. ఇప్పుడు ఒక్క రూపాయికే వైద్యం అందిస్తూ పేదలకు దేవుడయ్యాడు.
    Published by:Shiva Kumar Addula
    First published: