Home /News /national /

DO YOUR CHILDREN HAVE THESE SYMPTOMS BUT IT MUST BE MONKEYPOX READ THEM UMG GH

Monkeypox : మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నయా ? అయితే ఇది మంకీపాక్స్ అయి ఉంటుంది.. ఒకసారి చెక్ చేయడం బెటర్..!

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నయా ? అయితే ఇది మంకీపాక్స్ అయి ఉంటుంది.. అవేవో చదవండి!

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నయా ? అయితే ఇది మంకీపాక్స్ అయి ఉంటుంది.. అవేవో చదవండి!

మంకీపాక్స్ (Monkeypox) అనే మరో వైరస్ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతూ ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇటీవలే కేరళ (Kerala)లో కేసులు నమోదయ్యాయి. ఈ అంటువ్యాధి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

మంకీపాక్స్ (Monkeypox) అనే మరో వైరస్ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతూ ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇటీవలే మనదేశంలోని కేరళ (Kerala)లో కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు ఈ అంటువ్యాధి (Communicable Disease) బారిన పడిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ఈ అంటువ్యాధి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల (Children) విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. మంకీపాక్స్ వైరస్‌ పిల్లలకు సోకే ప్రమాదమెక్కువని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కూడా తెలిపింది. మరి ఇలాంటి సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మంకీపాక్స్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకడం ద్వారా మంకీపాక్స్ అంటువ్యాధి వస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్, మశూచి లక్షణాలు (Symptoms) ఒకే విధంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఈ వ్యాధి స్థానికం (Endemic)గా మాత్రమే ప్రబలుతున్నట్లు ప్రకటించాయి కానీ ఇటీవల చాలా దేశాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. మంకీపాక్స్ రోగుల్లో సాధారణంగా స్వల్ప లక్షణాలే కనిపిస్తాయి. పెద్దలు ఈ వ్యాధి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కరోనా వైరస్‌తో పోలిస్తే మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్టివిటీ చాలా తక్కువగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని AIIMS మెడిసిన్ విభాగానికి చెందిన అదనపు ప్రొఫెసర్ పీయూష్ రంజన్ తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది పిల్లలకు ప్రాణాంతకం (Fatal) కావచ్చని ఆయన హెచ్చరించారు. సాధారణంగా పిల్లలతో సహా వ్యాధి సోకిన పెద్ద వ్యక్తులలో అసౌకర్యం, జ్వరం, దద్దుర్లు, లింఫుగ్రంధుల్లో వచ్చిన కణుపులు, చలి వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

పిల్లలలో ఈ లక్షణాలతో జాగ్రత్త..

దద్దుర్లు
దద్దుర్లు అనేవి మంకీపాక్స్ వైరస్ సోకిన రెండవ లేదా మూడవ రోజున కనిపిస్తాయి. ఈ దద్దుర్లు ముఖం మీద మొదటగా కనిపిస్తాయి. తర్వాత చేతులు, అరచేతులు, పాదాలకు వ్యాపిస్తాయి. ఈ దద్దుర్లు ద్రవంతో నిండి ఉంటాయి.

జ్వరం
మంకీపాక్స్ పేషెంట్లలో పెద్దవారితో పోలిస్తే పిల్లలకు జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఈ కాలంలో పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..



తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. మీ పిల్లలు కోతులు, ఎలుకలు, ఉడతలు, ఇంకా జబ్బుపడిన ఇతర జంతువులకు దగ్గరగా ఆడుకోకుండా జాగ్రత్తపడాలి. అలాగే చనిపోయిన జంతు కళేబరాలు ఉన్న ప్రాంతాలకు వారిని చాలా దూరంగా ఉంచాలి.

2. బాగా వండిన మాంసాన్ని మాత్రమే వారికి అందించాలి సరిగా వండని మాంసాన్ని ఎప్పుడూ పెట్టకూడదు.

3. పిల్లలు వ్యాధి సోకిన వ్యక్తులతో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంకీపాక్స్ సోకిన వారికి అతి దగ్గరగా ఉండటం, వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం పెద్దలకు కూడా మంచిది కాదు.



4. పిల్లల చేతలను ప్రతిరోజు తరచుగా సబ్బు, నీటితో కలిగించాలి. మీ పిల్లల చేతులు ఎంత శుభ్రంగా ఉంటే మంకీపాక్స్ సోకే ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది.

5. పిల్లలకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడాలి.
Published by:Mahesh
First published:

Tags: Children, Corona, Health care, Monkeypox

తదుపరి వార్తలు