Home /News /national /

Corona cases: బెంగళూర్​ ఎయిర్​పోర్టులో ఇద్దరికి కరోనా.. వారికొచ్చిన కరోనా రకం ఏంటంటే.. 

Corona cases: బెంగళూర్​ ఎయిర్​పోర్టులో ఇద్దరికి కరోనా.. వారికొచ్చిన కరోనా రకం ఏంటంటే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరుకు (Bangalore) వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు (Two passengers) కరోనా సోకిందన్న వార్త నగరంలో సంచలనం సృష్టించింది. వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ రకం కరోనా వైరస్‌ సోకిందా ? అనే అనుమానంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం ఇరువురి శాంపిల్స్​పై ఫలితాలు (Results) వచ్చాయి.

ఇంకా చదవండి ...
    కరోనా (corona) ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతోంది. తగ్గిపోయిందనుకున్న కోవిడ్ (Covid 19)​ మళ్లీ పడగలిప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు జరిగే పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ (Omicron variant) పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఈ సౌతాఫ్రికా వేరియంట్ ఇండియాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ (Pm  Naredra modi) ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే దక్షిణాఫ్రికా (South Africa) నుంచి ఇటీవల బెంగళూరుకు (Bangalore) వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు (Two passengers) కరోనా సోకిందన్న వార్త నగరంలో సంచలనం సృష్టించింది. వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ రకం కరోనా వైరస్‌ (corona virus) సోకిందా ? అనే అనుమానంతో తీవ్ర కలకలం రేగింది. వారి నుంచి సేకరించిన శాంపిళ్ల (samples)ను ల్యాబ్‌లకు పంపించారు. ఆదివారం ఇరువురి శాంపిల్స్​పై ఫలితాలు (Results) వచ్చాయి.

    94 మంది ప్రయాణికులు..

    వారికి డెల్టా వేరియంట్‌ (delta variant) సోకినట్లు తేలడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ (Karnataka health ministry) అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 94 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో ఇద్దరికే కరోనా (corona cases) సోకింది. ‘భయపడాల్సిన పని లేదు. వారిని క్వారంటైన్‌లో ఉంచారు’ అని బెంగళూరు రూరల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌ (Bangalore Rural deputy commissioner Srinivas) స్పష్టంచేశారు.

    ఇజ్రాయెల్‌లో కేసులు..

    దక్షిణాఫ్రికాలో గత ఐదు రోజులుగా కొత్త కేసులు (corona cases) భారీగా పెరుగుతున్నాయి. ఐతే కొత్త వేరియెంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయా? అనే విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు సౌతాఫ్రికా నుంచి ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అక్కడి నుంచి వెళ్లిన వారిలో కొత్త వేరియెంట్ బయటపడుతోంది. ఇజ్రాయెల్‌లో నాలుగు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు(Corona cases) నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంది. ఐనప్పటికీ కొత్త వేరియెంట్ బారినపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి.. కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Airport, Bengaluru, Covid cases, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు