RRR Preview: రాజమౌళి ‘RRR’ సినిమాలో ఈ 12 విషయాల గురించి మీకు తెలుసా..?
RRR Preview: రాజమౌళి ‘RRR’ సినిమాలో ఈ 12 విషయాల గురించి మీకు తెలుసా..?
RRR Preview: బాహుబలి లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశమంతా వేచి చూస్తుంది. కచ్చితంగా అన్నిచోట్లా ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.
RRR Preview: బాహుబలి లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశమంతా వేచి చూస్తుంది. కచ్చితంగా అన్నిచోట్లా ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.
బాహుబలి లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశమంతా వేచి చూస్తుంది. కచ్చితంగా అన్నిచోట్లా ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు.
చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కనిపించారు. అయితే ఈ ఇద్దరివీ సినిమాలో చాలా చిన్న పాత్రలు మాత్రమే. వీళ్లతో పాటు అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రల్లో నటించారు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మరో పాత్రలో నటించాడు. చరిత్రలో ఎక్కడా కలవని ఇద్దరు స్వాంతంత్య్ర సమరయోధుల కథను ఫిక్షనల్‌గా తెరకెక్కించాడు రాజమౌళి. ఈ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. RRR సినిమాకు రూ.336 కోట్ల బడ్జెట్ అయ్యింది. అందులో పారితోషికాలు లేవు.. వాటిని కూడా కలిపితే చాలా ఎక్కువ అవుతుంది.
2. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా నటించిన ఆలియా భట్ కు రూ.10 కోట్ల పారితోషికం అందుకుంది. ఈమె కేవలం 20 నిమిషాలు కూడా లేని పాత్ర చేసింది.
3. సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు 20 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. ఈయన పాత్ర కూడా చిన్నదే.
4. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒలీవియా మోరిస్‌కు దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈమె ఎన్టీఆర్ జోడీగా నటించింది.
5. సినిమాలో మరో చిన్న పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ శ్రీయ కూడా కోటి వరకు పారితోషికం అందుకుంది.
6. ట్రిపుల్ ఆర్ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించింది నటుడు సముద్ర ఖని. ఈయనకు కూడా 50 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు. చరణ్‌తో పాటు ఉండే పాత్ర ఇది.
7. ఈ సినిమాలో చాలా మంది ఫారెన్ యాక్టర్స్ ఉన్నారు. అందరికీ కలిపి మరో 4 కోట్ల వరకు పారితోషికం అందించారు.
8. ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డారు యూనిట్. అందులో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులున్నారు.. వాళ్లతో పాటు కొందరు చిన్న నటీనటులు కూడా ఉన్నారు. టెక్నికల్ టీమ్ ఖర్చులు కూడా కలిపి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని తెలుస్తుంది.
9. రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా ఉండాల్సింది VFX. ఇందులోనూ ఈ విభాగం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేశారు.
10. దర్శకుడు రాజమౌళి రెమ్యునరేషన్‌తో పాటు తన టీమ్ ఖర్చు అంతా కలిపి 200 కోట్ల వరకు అయిందని ప్రచారం జరుగుతుంది.
11. ఈ సినిమాకు రాజమౌళి పారితోషికం తీసుకోలేదు.. సినిమాలో భాగం తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
12. అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్ చరణ్ పారితోషికం దాదాపు 35 కోట్లు అని తెలుస్తుంది.
13. కొమరం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 35 కోట్లు అని ప్రచారం జరుగుతుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.