Home /News /national /

DO YOU KNOW THE HIGHEST FLAG IN THE COUNTRY IF YOU READ THE SPECIALS YOU WILL SALUTE UMG GH

Tallest Flag Pole: దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..!

 దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..

దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జెండా(Flag) స్తంభంపై భారత పతాకాన్ని ఎగరవేయనున్నారు. ఈ అరుదైన సందర్భానికి కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లాలోని హోసపేట (Hosapete) వేదికగా నిలువనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇండియా(India) ఈ సంవత్సరం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోనుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ (Azadi Ka Amrit) మహోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఆగస్టు 15న అందరూ ఇళ్లపై జాతీయ జెండా(Flag)లు ఎగరేయాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఇన్ని ప్రత్యేకతల మధ్య మరో అరుదైన ఘటన పంద్రాగస్టున చోటు చేసుకోబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జెండా స్తంభంపై భారత పతాకాన్ని ఎగరవేయనున్నారు. ఈ అరుదైన సందర్భానికి కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లాలోని హోసపేట (Hosapete) వేదికగా నిలువనుంది.

రెండో ఎత్తైన స్తంభం కూడా కర్ణాటకలోనే..
ఈ 123 మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఎగరేసేందుకు స్తంభాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే దేశంలోనే రెండవ ఎత్తైన జెండా స్తంభం కూడా కర్ణాటక(Karnataka)లోనే ఉండటం విశేషం. బెలగావిలోని కోటే కెరె వద్ద 110 మీటర్ల ఎత్తైన జెండా స్తంభం ఉంది. హోసపేటలో దేశంలోనే ఎత్తైన జెండా స్తంభాన్ని నిర్మించాలనే ఆలోచన స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్‌కు వచ్చింది. ఆయన నిర్ణయంతోనే జెండా స్తంభం ప్రాజెక్ట్ ప్రారంభమైంది. జిల్లా పర్యాటక శాఖ ఈ ప్రాజెక్టు కోసం రూ.6 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రైవేట్ స్పాన్సర్లు పునీత్ రాజ్‌కుమార్ స్టేడియంలో జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసే పనిని చేపట్టారు. 120x80 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే జెండా స్తంభం ఏర్పాటు పనులను మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీ చేపడుతోంది.

ఇదీ చదవండి: Raksha Bandhan:రక్షా బంధన్‌కి ఇలా ప్లాన్ చేయండి.. మీ సోదరి ఎంత సంతోషిస్తుందో తెలుసా !



పర్యాటక ఆకర్షణగా జెండా స్తంభం
జెండా స్తంభం నిర్మాణ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ..‘హంపి, తుంగభద్ర రిజర్వాయర్‌తో పాటు కొత్త జెండా స్తంభం జిల్లాలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. జిల్లాకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. హోసపేట, పరిసరాల్లో ఎక్కడి నుంచైనా జెండా స్తంభం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా హోసపేటకు గుర్తింపు లభిస్తుంది.’ అని తెలిపారు.



ఆగస్టు 15న ఆనంద్‌సింగ్‌ జెండా స్తంభాన్ని ఆవిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కానీ కొప్పల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నందున, ఆయన కొప్పల్‌ స్టేడియంలో జెండాను ఎగురవేయనున్నారు. హోసపేటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శశికళ జోలె హాజరుకానున్నారు. ప్రాజెక్ట్ ఆలోచనలో సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నందున సన్మానాలు చేయడానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే దానిపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కొన్ని వర్గాలు తెలిపాయి.
Published by:Mahesh
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Flag, Karnataka, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు