హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

World Hepatitis Day: హెపటైటిస్ వైరస్‌తో ఎంత మంది బాధ పడుతున్నారో తెలుసా ? WHO చెప్తున్న నిజాలు చదివితే షాక్ అవుతారు !

World Hepatitis Day: హెపటైటిస్ వైరస్‌తో ఎంత మంది బాధ పడుతున్నారో తెలుసా ? WHO చెప్తున్న నిజాలు చదివితే షాక్ అవుతారు !

హెపటైటిస్ వైరస్‌తో ఎంత మంది బాధ పడుతున్నారో తెలుసా ? WHO చెప్తున్న నిజాలు  చదివితే షాక్ అవుతారు !

హెపటైటిస్ వైరస్‌తో ఎంత మంది బాధ పడుతున్నారో తెలుసా ? WHO చెప్తున్న నిజాలు చదివితే షాక్ అవుతారు !

ప్రజలను ఆందోళనకు గురిచేసే వ్యాధులపై ఎప్పటికప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వివిధ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తుంది. ఈ క్రమంలో ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అయిన హెపటైటిస్‌(Hepatitis)పై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుతోంది..

ఇంకా చదవండి ...

వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలు ప్రత్యేక దినోత్సవాలను నిర్వహిస్తుంటాయి. ప్రజలను ఆందోళనకు గురిచేసే వ్యాధులపై ఎప్పటికప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తుంది. ఈ క్రమంలో ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అయిన హెపటైటిస్‌(Hepatitis )పై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

హెపటైటిస్ వైరస్‌లో ఐదు ప్రాథమిక జాతులు ఉంటాయి. వీటిని A, B, C, D, E వంటి ఐదు రకాలుగా వర్గీకరించారు. ఇవన్నీ కాలేయ వ్యాధికి కారణమవుతాయి. అయితే వీటికి కారణం, వ్యాప్తి, తీవ్రత పరంగా కీలకమైన తేడాలు ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు 354 మిలియన్ల మంది హెపటైటిస్ B, Cతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. చాలా మంది ఈ వ్యాధుల టెస్టింగ్(Testing), ట్రీట్మెంట్‌కు దూరంగా ఉంటున్నారని విశ్లేషించింది. ఇలాంటి వారికి అవగాహన కల్పించడమే ఈ స్పెషల్ డే లక్ష్యం.

హిస్టరీ

ప్రపంచాన్ని హెపటైటిస్‌ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో 2007లో వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ స్థాపించారు. మొదటి కమ్యూనిటీ-ఆర్గనైజ్డ్ వరల్డ్ హెపటైటిస్ డేను 2008లో నిర్వహించారు. 1967లో అమెరికన్ వైద్యుడు బరూచ్ శామ్యూల్ బ్లమ్‌బెర్గ్ హెపటైటిస్ బి వైరస్‌ను కనుగొన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఈ శాస్త్రవేత్తను గౌరవించడం కోసం అతని పుట్టినరోజు అయిన జులై 28ని ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా ఎంచుకున్నారు. శామ్యూల్ బ్లమ్‌బెర్గ్ ఈ వైరస్‌ను గుర్తించే టెస్టును, దాన్ని నిరోధించే టీకాను కూడా కనుగొన్నారు.

ఇదీ చదవండి: Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !



ప్రాముఖ్యత

హెపటైటిస్ వివిధ రూపాల గురించి, అవి ఎలా సంక్రమిస్తాయి అనే దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటారు. వైరల్ హెపటైటిస్‌తో పాటు సంబంధిత వ్యాధుల నిర్వహణ, గుర్తింపు, నివారణను మెరుగుపరచడం కూడా ఈ స్పెషల్ డే లక్ష్యం. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ (Vaccination )డ్రైవ్‌ను పెంచాల్సిన ప్రాముఖ్యతను ఈ రోజు గుర్తు చేస్తుంది. ఒక కలెక్టివ్ గ్లోబల్ హెపటైటిస్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2022 థీమ్ ఏంటి?

ఈ సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం థీమ్.. 'హెపటైటిస్ సంరక్షణను మీకు చేరువ చేయడం. (Bringing hepatitis care closer to you).' హెపటైటిస్ కేర్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంపై అవగాహన పెంచడం ఈ థీమ్ ఆలోచన.

First published:

Tags: Corona virus, Health care, Vaccination, WHO

ఉత్తమ కథలు