ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరిగా ఉండాలి. ఏం లేకున్నా పరవా లేదు గానీ.. ఇది లేకుంటే మాత్రం ఏమీ చేయలేరు. స్కూల్లో అడ్మిషన్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు ప్రతి చోటా ఆధార్ కార్డును అడుగుతారు. ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. బ్యాంక్‌లో అకౌంట్ తెరవాలన్నా... పాస్ పోర్టు పొందాలన్నా.. ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఇది లేకుండా ఏదీ రాదు. మన దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూ ఆధార్ కార్డు తీసుకోవాలి. ఖచ్చితంగా ఉండాలి కూడా..! ప్రస్తుతం ఐదేళ్లు పైబడిన అందరికీ తమ ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్ కార్డులను జారీ చేస్తున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు మాత్రం ఇవేవీ లేకుండా.. తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ రెఫరెన్స్‌తో ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఐతే పెద్ద వారి ఆధార్ కార్డు, ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ కార్డు.. రెండు ఒకేలా ఉండవు. పిల్లలకు కాస్త భిన్నమైన ఆధార్ కార్డులను ఇస్తారు. అది ఎలా ఉంటుంది? దాని ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDIA) చైల్డ్ ఆధార్ కార్డ్‌ను జారీ చేస్తుంది. వాటిని బాల్ ఆధార్ కార్డులుగా (Baal Adhaar Card) పిలుస్తున్నారు. ఇది కూడా సాధారణ కార్డు లాగే ఉంటుంది. కానీ రంగులో మాత్రం తేడా ఉంటుంది. పిల్లల ఆధార్ కార్డును నీలి రంగులో (Blue aadhaar card) జారీ చేస్తారు. అవసరమైన వ్యాలిడ్ డాక్యమెంట్లను అందించి తల్లిదండ్రులు తమ చైల్డ్ ఆధార్ కార్డులను తీసుకోవచ్చు. పిల్లల ఆధార్ కార్డు కోసం 31 రకాల ఐడీ ప్రూఫ్‌లు, 44 రకాల అడ్రస్ ప్రూఫ్‌లు, 14 రకాల రిలేషన్షిప్ ప్రూఫ్‌లు, 14 రకాల బర్త్ సర్టిఫికెట్లను UIDAI యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు మీ పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ తీసుకోవాలంటే.. మీ సమీపంలో ఉన్న ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. వారికి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి చైల్డ్ ఆధార్ కార్డునుపొందవచ్చు.
పిల్లలకుకు ఐదేళ్లు నిండిన తర్వాత నీలి రంగులో ఉండే ఈ బాల్ ఆధార్ కార్డు చెల్లదు.
బాల్ ఆధార్‌ను రూపొందించడానికి పిల్లల పాఠశాల IDని కూడా ఉపయోగించవచ్చు.
బాల్ ఆధార్ కార్డును పొందేందుకు బర్త్ సర్టిఫికెట్ లేదా వారు పుట్టిన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ సమరీ ఇస్తే సరిపోతుంది.
కేవలం పిల్లల కోసం రూపొందించిన ఈ నీలి రంగు ఆధార్ కార్డులో ఐదేళ్ల వరకు వేలిముద్రలు, కళ్లను స్కాన్ చేయరు.
పిల్లల వయస్సు 5 ఏళ్లు పూర్తయిన తర్వాత వారి బయోమెట్రిక్ ఆధార్ డేటాను అప్డేట్ చేయాలి. 15 ఏళ్ల వయసులో మరోసారి అప్డేట్ చేయడం అవసరం.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.