Home /News /national /

DO YOU KNOW ABOUT INDEPENDENCE IF YOU READ THESE BOOKS ROMA WILL BE HAPPY UMG GH

Independence Day: స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసా.. ఈ పుస్తకాలు చదివితే రోమాలు నిక్కపొడుచుకుంటాయి

 స్వాతంత్ర్య ఉద్యమం  గురించి తెలుసా..  ఈ  పుస్తకాలు చదివితే రోమాలు నిక్కపొడుచుకుంటాయి

స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసా.. ఈ పుస్తకాలు చదివితే రోమాలు నిక్కపొడుచుకుంటాయి

భారతదేశ స్వాతంత్ర్య(Independence) పోరాటం గురించి అందరికీ అవగాహన కల్పించే పుస్తకాలు(Books) ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఐదు పుస్తకాలు చదివితే స్వాతంత్ర్యం కోసం అప్పటి దేశ ప్రజలు చేసిన పోరాటాల గురించి, స్వాతంత్ర్యం తర్వాత భారత దేశం(India)లో జరిగిన సంఘటనల గురించి పూర్తిస్థాయిలో తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం (Independence) లభించి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ 75 ఏళ్ల పాటు భారత ప్రజలు స్వేచ్ఛతో జీవిస్తున్నారంటే దానికి కారణం ఎందరో మహనీయులు, వారు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు అని చెప్పవచ్చు. మన దేశం బ్రిటిష్(British) వారి నుంచి స్వాతంత్య్రం ఎలా సాధించిందో కచ్చితంగా తెలుసుకోవాలంటే.. స్వాతంత్ర్యానికి సంబంధించి రాసిన మంచి పుస్తకాలు (Books) చదవాలి. అయితే భారతదేశ స్వాతంత్ర్య పోరాటం గురించి అందరికీ అవగాహన కల్పించే పుస్తకాలు ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఐదు పుస్తకాలు చదివితే స్వాతంత్య్రం కోసం అప్పటి దేశ ప్రజలు చేసిన పోరాటాల గురించి, స్వాతంత్య్రం తర్వాత భారత దేశంలో జరిగిన సంఘటనల గురించి పూర్తిస్థాయిలో తెలుస్తుంది. మరి ఆ పుస్తకాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Partition of India: Why 1947?
బ్రిటిష్ రాజ్ నుంచి ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్(Pakistan) అనే రెండు సార్వభౌమ రాజ్యాలు ఏర్పడ్డాయి. కౌశిక్ రాయ్ ఈ పుస్తకంలో విభజనకు కీలకమైన సమయం, కారణం అనే రెండు అంశాల గురించి వివరించారు. ఈ పుస్తకంలో విభజనకు ప్రధాన చర్చలు, అవి కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను తెలుసుకోవచ్చు. 1947లో విభజన ప్రణాళిక ఆమోదానికి దారితీసిన సంఘటనల అంచనాలతో ఈ పుస్తకం ముగుస్తుంది.

The Partition of India
హైమంతి రాయ్ రాసిన పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకం హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ అనే అంశంపై దృష్టి సారిస్తుంది. విభజన అనేది 1947కి పరిమితం కాకుండా దశాబ్దానికి పైగా కొనసాగిన సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రక్రియ అని ఈ బుక్ వివరిస్తుంది. బెంగాల్, పంజాబ్‌లలో పునరావాసం, వలసలు, హింసను కూడా ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఈ పుస్తకంలో దేశ నిర్మాణానికి సంబంధించిన సందర్భోచిత నేపథ్యాలతో హింస, నష్టం గురించి తెలుసుకోవచ్చు.

A Republic in the Making: India in the 1950s
జ్ఞానేష్ కుడైస్యా రాసిన 'ఏ రిపబ్లిక్ ఇన్ ది మేకింగ్' బుక్ స్వాతంత్య్రం తర్వాత సంవత్సరాల్లో భారతదేశ ప్రయాణం ఎలా సాగిందనే విషయాలను వివరిస్తుంది. సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించుకోవడానికి భారతదేశం ఆ సంవత్సరాల్లో చెప్పుకోదగిన మార్గాల్లో ఎలా రూపాంతరం చెందిందనే దానిపై ఇది పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుంది.

ఇదీ చదవండి:  Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 Indian Democracy
సుహాస్ పల్షికర్ రచించిన పుస్తకం ఇండియన్ డెమోక్రసీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ''వర్క్ ఇన్ ప్రోగ్రెస్''గా అభివర్ణిస్తుంది. ఈ పుస్తకం భారత ప్రజాస్వామ్యం కేంద్ర వైరుధ్యాలను హైలైట్ చేస్తుంది. ఈ పుస్తకం ప్రజాస్వామ్యం, ఇటీవలి సవాళ్ల గురించి గొప్పగా అవగాహన కల్పిస్తుంది.



Roads to Freedom: Prisoners in Colonial India
వలస భారతదేశంలోని జైళ్లు, ఖైదీల చరిత్రను ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకం ఖైదీల అనుభవాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో రాజకీయాలు, నిరసనలు, ప్రతిఘటనల భావనల గురించి కూడా తెలియజేస్తుంది. ఈ పుస్తకం నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నుంచి రికార్డులు, స్థానిక వార్తాపత్రికల నివేదికలు, జ్ఞాపకాల వంటి వాటి ఆధారంగా రాశారు.
Published by:Mahesh
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Freedom, Independence Day 2022, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు