హోమ్ /వార్తలు /జాతీయం /

దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దన్న స్పైస్ జెట్‌... నెటిజన్స్ ఫైర్

దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దన్న స్పైస్ జెట్‌... నెటిజన్స్ ఫైర్

దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దన్న స్పైస్ జెట్‌పై మండిపడిన కాక్ బ్రాండ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్

దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దన్న స్పైస్ జెట్‌పై మండిపడిన కాక్ బ్రాండ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్

SpiceJet No-Crackers Diwali : స్పైస్ జెట్ కంపెనీకి చెందిన బ్యానర్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీపావళికి బాణసంచా కాల్చొద్దనే హక్కు మీకు ఎవరిచ్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  SpiceJet No-Crackers Diwali : వినాయకచవితికి... మట్టి వినాయక విగ్రహాలనే వాడదామనే ప్రచారం ఎప్పుడూ ఉండేదే. అలాగే... దీపావళి రాగానే... బాణసంచా కాల్చొద్దని చెప్పడం చాలా మంది ఫ్యాషనైపోతోంది. అదేమంటే పొల్యూషన్ అంటూ కబుర్లు చెబుతుంటారు. స్పైస్‌జెట్ కూడా అదే చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో నో క్రాకర్స్ దివాళీ బ్యానర్ ఏర్పాటుచేసింది. ఈ దీపావళిని బాణసంచా కాల్చకుండా జరుపుకుందామని కోరింది. దీనిపై... కాక్ బ్రాండ్ పేరుతో బాణసంచా తయారు చేస్తున్న కంపెనీ... శ్రీ కాళీశ్వరీ ఫైర్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ మండిపడింది. మీరు కాలుష్యం లేని విమానాల్ని నడుపుతున్నారా అని ప్రశ్నించింది. మీ విమానాలకు వాడే ఇంధనం... వైట్ పెట్రోలా, గ్రీన్ పెట్రాలా అని ప్రశ్నిస్తూ... ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ముందు మీ విమానాల్ని చెత్తబుట్టలో పడేసి... అప్పుడు ప్రజలకు సలహాలు ఇవ్వండి అని కౌంటరేసింది.

  telangana news, andhra pradesh news, telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్, తెలంగాణ న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఏపీ న్యూస్, ఏపీ అప్ డేట్స్, తెలంగాణ అప్ డేట్స్,
  దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దన్న స్పైస్ జెట్‌పై మండిపడిన కాక్ బ్రాండ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్

  నెటిజన్లు కూడా స్పైస్‌జెట్‌పై మండిపడ్డారు. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలన్నారు. హిందువులు స్పైస్‌జెట్‌లో ప్రయాణించడం మానేస్తే బెటరని ఓ నెటిజన్ ఫైర్ అయ్యారు.

  నిజానికి బాణసంచా వల్ల ఇదివరకు జరుగుతున్నంత పొల్యూషన్ ఇప్పుడు లేదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. బాణసంచా రేట్లు డబుల్ అవ్వడంతో... ప్రజలు వాటిని ఎక్కువగా వాడట్లేదనీ, అందువల్ల ఇలాంటి సలహాలు అవసరం లేదని ఆయన అన్నారు.

  స్పైస్‌జెట్ లాంటి కంపెనీలు ఇలాంటి సలహాలు ఇవ్వాల్సిన పని లేదనీ... పొల్యూషన్‌పై ప్రజలకు ఆల్రెడీ అవగాహన ఉందనీ, ఎంత కాల్చాలో, ఎలా దీపావళి జరుపుకోవాలో తమకు తెలుసని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు.


  Pics : వర్చువల్ అందాలతో కట్టిపడేస్తున్న నూనూరి


  ఇవి కూడా చదవండి :


  ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు... చంద్రబాబు టార్గెట్ ఇదీ...

  Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

  Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

  Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Diwali 2019, SpiceJet

  ఉత్తమ కథలు