కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లు రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్లలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులెవరూ సందేహా పడాల్సిన అవసరం లేదని, టికెట్లను రద్దు చేసుకోవద్దని ఐఆర్సీటీసీ పేర్కొంది. టికెట్కు సంబంధించిన మొత్తం డబ్బు పూర్తిగా రీఫండ్ అవుతుందని స్పష్టం చేసింది. ఇదిలావుంటే.. రైల్వే శాఖ టికెట్లను రద్దు చేసుకునేందుకు జూన్ 21 వరకు మూడు నెలల పాటు గడువు పొడగించింది. దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం వల్ల ఈ-టికెట్ రద్దుపై అనుమానాలు వెల్లడయ్యాయని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వినియోగదారులు తొందరపడి టికెట్లను రద్దు చేసుకోవద్దని, అలా చేసుకుంటే.. వారికి తక్కువ నగదు రీఫండ్ అయ్యే అవకాశముంది. అందుకే రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న వారు టికెట్లు రద్దు చేసుకోవద్దని ఐఆర్సీటీసీ చెబుతోంది. ప్రయాణికులు తమ టికెట్లను ఏ ఖాతా నుంచి బుక్ చేసుకుంటే.. మళ్లీ అదే ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, Rail, Railway station, Railways