హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అయ్యో... మగాళ్లకు గృహ హింస చట్టం లేదే... మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్య

అయ్యో... మగాళ్లకు గృహ హింస చట్టం లేదే... మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్య

అయ్యో... మగాళ్లకు గృహ హింస చట్టం లేదే... మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్య (image credit - twitter)

అయ్యో... మగాళ్లకు గృహ హింస చట్టం లేదే... మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్య (image credit - twitter)

Madras high court: కోర్టులు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి సంచలనం సృష్టిస్తాయి. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యతో... మగాళ్లంతా ఏకమవుతున్నాయి. తమకూ గృహ హింస చట్టం కావాలంటున్నారు. ఈ వ్యాఖ్య ఎందుకు చేసిందో చూద్దాం.

  Madras high court: సస్పెండైన ఓ ఆఫీసర్‌ను తిరిగి నియమిస్తూ... మద్రాస్ హైకోర్టు... అయ్యో... మగాళ్లకు ప్రత్యేక గృహ హింస చట్టం అనేది లేదే అంది. ఎందుకంటే... సస్పెండ్ అయ్యాక ఆ ఆఫీసర్... తన భార్య చేతిలో... నరకం చూశాడు. ఆమె పెట్టే హింసను భరించలేక... ఆమెకు దూరంగా పారిపోయాడు. "ఇప్పుడున్న జనరేషన్.... పెళ్లి అనేది కాంట్రాక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 2005లో గృహ హింస చట్టం వచ్చింది. అది సహజీవనాన్ని ఆమోదించింది" అని జస్టిస్ ఎస్.వైద్యనాథన్ సోమవారం అన్నారు. ప్రస్తుత కేసు విషయానికి వస్తే... డాక్టర్ పి.శశికుమార్... చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఐతే... ఆయన భార్య... ఆయనపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టడంతో... సస్పెండ్ అయ్యారు.

  "విడాకులకు అప్లై చేసుకున్న కేసులో తీర్పు వచ్చే ముందు... శశికుమార్ భార్య ఆయనపై ఆ కేసు పెట్టారు. ఇది ఎలా కనిపిస్తుందంటే.... విడాకులు వచ్చేస్తే... ఇక ఆయన్ని హింసించడం కుదరదు. అందువల్ల ఆమె ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే గృహ హింస కేసు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ కేసు ఆధారంగా పోలీసులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. అటు శాఖాపరంగా సస్పెండ్ అయ్యాను" అని జస్టిస్ వైద్యనాథన్ అన్నారు.

  ఫ్యామిలీ కోర్టు మరో 4 రోజుల్లో విడాకులను అంగీకరిస్తూ తీర్పు ఇవ్వబోతుండగా... ఆమె ఈ కేసు పెట్టారు. 2015లో సాలెం కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా... ఫిబ్రవరి 2020లో డైవర్స్‌కి అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని లెక్కలోకి తీసుకున్న హైకోర్టు... ఆయన్ని శాఖ నుంచి సస్పెండ్ చెయ్యాల్సిన పనిలేదనీ... మరో 15 రోజుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చాలని తీర్పు ఇచ్చింది.

  ఇది కూడా చదవండి: Business Ideas: బంజరు భూముల్లో లెమన్ గ్రాస్ సాగు... లాభాలు చూస్తున్న రైతులు

  ఈ సందర్భంగా జస్టిస్ వైద్యనాథన్ ఓ వ్యాఖ్య అన్నారు. "భార్యాభర్తలు ఓ విషయాన్ని గ్రహించాలి. ఇగో, అసహనం అనేవి... చెప్పుల లాంటివి. వాటిని ఇంటి బయటే వదిలేయాలి తప్ప లోపలికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే... భార్యాభర్తలతోపాటూ... వారి పిల్లలు కూడా... దయనీయమైన జీవితాన్ని అనుభవిస్తారు" అని అన్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Chennai, Madras high court, Tamil nadu

  ఉత్తమ కథలు