హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

DK Shivakumar: బీజేపీ నేత మనవడితో డీకే శివకుమార్ కూతురి నిశ్చితార్థం.. హాజరైన సీఎం యాడ్యూరప్ప

DK Shivakumar: బీజేపీ నేత మనవడితో డీకే శివకుమార్ కూతురి నిశ్చితార్థం.. హాజరైన సీఎం యాడ్యూరప్ప

నిశ్చితార్థ వేడుకలో ఐశ్వర్య, అమర్త్య హెగ్డే

నిశ్చితార్థ వేడుకలో ఐశ్వర్య, అమర్త్య హెగ్డే

కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ మనవడు అమర్త్య హెగ్డేతో గురువారం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు.

ఇంకా చదవండి ...

కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ మనవడు అమర్త్య హెగ్డేతో గురువారం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని తాజ్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు కర్ణాటక సీఎం యాడ్యూరప్ప హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అమర్త్య హెగ్డే బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన తల్లి మాళవికతో కలిసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఐశ్వర్య తన తండ్రి డీకే శివకుమార్ స్థాపించిన గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు.

అయితే.. సిద్ధార్థ, శివకుమార్‌ చిన్ననాటి మిత్రులు. అయితే వీరు వియ్యమందుకోవాలని గతంలోనే అనుకున్నారు. కానీ సిద్దార్థ ఆ‍త్మహత్యతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు ఈ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. అనంతరం కొన్ని రోజులకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో మళ్లీ వాయిదా పడింది.

ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వాలు సడలించిన నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహించారు. సిద్దార్థ గత సంవత్సరం జూలై 2019 లో అదృశ్యమయ్యారు. అనంతరం కొన్ని కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యల కారణంగానే సిద్ధార్థ ఆత్మహత్య చేసకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.

First published:

Tags: Dk shivakumar, Karnataka, Yediyurappa

ఉత్తమ కథలు