కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ దీపావళి గిఫ్ట్..

ప్రధాని నరేంద్ర మోదీ (File)

ఉద్యోగులకు 5 శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 50లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ అందించింది. 5 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 50లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. ప్రస్తుతం ఉన్న 12 శాతం డీఏపై మరో ఐదు శాతం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూలైలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.16,000 కోట్ల భారం పడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పారు. ఒకేసారి కేంద్ర ప్రభుత్వం 5 శాతం డీఏ పెంచడం అనేది ఇదే మొదటిసారి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం నింపుతుందని ప్రకాష్ జావదేకర్ అన్నారు. అక్టోబర్ 27న దీపావళి పండుగ ఉంది.

    బంధువులు కాబోతున్న అజారుద్దీన్, సానియా మీర్జా


    First published: