అయోధ్యలో ప్రపంచ రికార్డ్.. 5.51 లక్షల మట్టి దీపాలతో వెలుగులు

దీపావళి వేళ రామకథ పార్క్‌లో 'రాముడికి రాజ తిలకం' కార్యక్రమంలో పాల్గొన్నారు యోగి. ఈ సందర్భంగా అయోధ్యంలో రూ.226 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

news18-telugu
Updated: October 26, 2019, 9:29 PM IST
అయోధ్యలో ప్రపంచ రికార్డ్.. 5.51 లక్షల మట్టి దీపాలతో వెలుగులు
అయోధ్యలో దీపోత్సవం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి వేడుకలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలోని సరయు నది ఒడ్డున దిపోత్సవం ఘనంగా నిర్వహించారు. 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించారు. ప్రపంచంలోనే అతి పెద్ద నూనె దీపాల ప్రదర్శనగా దీపోత్సవం-2019 గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఈ కార్యక్రమానికి యూపీ గవర్నర్ ఆనందీ బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు మంత్రులు, నేతలు హాజరయ్యారు. అనంతరం నయా ఘాట్ వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయోధ్య గురించి మాట్లాడినప్పుడు నా మదిలో రామ రాజ్యం మెదులుతుంది. ఇప్పుడు దేశంలో ఆధునిక రామ రాజ్యం నడుస్తోంది. కుల,మత,ప్రాంతీయ,లింగ వివక్ష లేకుండా సుపరిపాలన అందిస్తున్నాం. మేం వేరే వారి విషయంలో జోక్యం చేసుకోం. కానీ మా జోలికి వస్తే మాత్రం.. ధీటైన సమాధానం చెబుతాం.
యోగి ఆదిత్య నాథ్

దీపోత్సవం కార్యక్రమంలో 2500 మంది కళాకారులు రామాయణంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శించారు. దీపోత్సవానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.133 కోట్లు ఖర్చుపెట్టింది. అంతేకాదు దీపావళి వేళ రామకథ పార్క్‌లో 'రాముడికి రాజ తిలకం' కార్యక్రమంలో పాల్గొన్నారు యోగి. ఈ సందర్భంగా అయోధ్యంలో రూ.226 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు