గర్భిణీకి పురుడు పోసిన ఎమ్మెల్యే.. ఎమర్జెన్సీ సిజేరియన్ చేసి..

ఎమ్మెల్యే Z.R. థియామ్సంగ

గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ఎమ్మెల్యేకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ పురిటి నొప్పులతో అల్లాడుతోందని.. ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ అనారోగ్యం కారణంగా సెలవుల్లో ఉన్నాడని అవతలి నుంచి చెప్పారు.

 • Share this:
  జనంలోకి వెళ్లి ఫొటోలకు పోజులిచ్చే ఎమ్మెల్యేలను చాలా మందిని చూశాం. ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధికార దర్పం ప్రదర్శించే నేతలను ఎంతో మందిని చూశాం. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్లి సాయం చేసే గొప్ప నాయకులు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు ఈ ఎమ్మెల్యే. ప్రసవ వేదనతో అల్లాడుతున్న నిండు గర్భిణీకి స్వయంగా పురుడు పోశారు. ఎమర్జెన్సీ సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. ఎమ్మెల్యే దేవుడిలా వచ్చి వైద్యం చేయడంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

  మిజోరాంలోని చాంపై నార్త్ నియోజకవర్గానికి డాక్టర్ Z.R. థియామ్సంగ ఎమ్మెల్యేగా ప్రాతనిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల్లో వరసగా స్వల్ప భూంకంపాలు రావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా పరిస్థితిని కూడా తెలుసుకునేందుకు ఆయన వెళ్లారు. ఐతే అదే సమయంలో ఎమ్మెల్యేకు ఫోన్ కాల్ వచ్చింది. జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ పురిటి నొప్పులతో అల్లాడుతోందని.. ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ అనారోగ్యం కారణంగా సెలవుల్లో ఉన్నాడని అవతలి నుంచి చెప్పారు. రకస్త్రావం కూడా అవుతోందని సమాచారం అందించారు.

  వృత్తిరీత్యా గైనకాలజీ వైద్యుడైన ఎమ్మెల్యే థియామ్సంగ ఏ మాత్రం ఆలోచించకుండా ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఎందుకంటే 200 కి.మీ. దూరంలో తప్ప చుట్టుపక్కల వేరే ఆస్పత్రులు కూడా లేవు. ఆమెకు అత్యవసరంగా సిజేరియన్ అవసరమని భావించి.. వెంటనే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి చెప్పాడు. ఆ తర్వాత సిజేరియన్ చేసి గర్భిణీకి పురుడు పోశారు. గతంలో కూడా మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు థియామ్సంగ. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) పార్టీ తరపు పోటీచేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్‌సంగను ఆయన ఓడించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: