నీళ్లు, కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు కేంద్రం షాక్..

అధికారం కోల్పోయినా ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్న 27 మంది మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. వారి ఇళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: October 15, 2019, 4:45 PM IST
నీళ్లు, కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు కేంద్రం షాక్..
ప్రధాని మోదీ (ఫైల్)
news18-telugu
Updated: October 15, 2019, 4:45 PM IST
అధికారం కోల్పోయినా ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్న 27 మంది మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. వారి ఇళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్‌సభ హౌస్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి అధికారం కోల్పోయిన మరు క్షణమే అధికారిక బంగ్లాను, హోదాను విడిచిపెట్టాలి. కానీ, చాలా మంది వాటిల్లోనే ఉంటూ, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అనుభవిస్తున్నారు దీనిపై ఇప్పటికే చాలా మంది ఎంపీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టమైన సూచనలు వచ్చాయి. అయినా, మాజీ ఎంపీలు ఖాళీ చేయలేదు. దాంతో ప్రస్తుతం ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం బంగ్లా కేటాయించలేకపోయింది. వాళ్లు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన గెస్ట్ హౌజ్‌లలో, ఇతర స్థానాల్లో నివాసం ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని కమిటీ.. వాళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కట్ చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా.. ఢిల్లీ పోలీసుల సహాయంతో మాజీ ఎంపీలను ఖాళీ చేయించాలని కూడా ఆదేశాలు వచ్చాయి.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...