Dirty Things In Hazipur Hotels : బీహార్‌లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవహారం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను అరికట్టేందుకు పోలీసు బృందం హజీపూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న హోటళ్లపై రైడ్(Raid) చేసేందుకు వెళ్లింది. బీహార్(Bihar)లో అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ నిఘా వర్గాల సమాచారంతో హాజీపూర్(Hajipur) రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న డజనుకు పైగా హోటళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. అయితే పోలీసులు హోటళ్లపై దాడులు చేయడం ప్రారంభించినప్పుడు...అక్కడ జరుగుతున్న యవ్వారం తెలిసి పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక్కడి హోటళ్లలో సాగుతున్న భారీ వ్యభిచార రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. డబ్బు కోసం హోటళ్లలో పెద్దఎత్తున వ్యభిచార వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాదాపు 15మంది మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ఈ దాడితో అసాంఘిక శక్తులతో పాటు అనైతిక పనులు చేసే వారిపై కూడా వేటు పడింది.
ఈ విషయమై సదర్ ఎస్డిపిఓ రాఘవ దయాళ్ మాట్లాడుతూ.... ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు సదర్ ఎస్‌డిఎం ఆధ్వర్యంలో హజీపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని పలు హోటళ్లలో దాడులు నిర్వహించాం. ఈ రైడ్ లో హోటల్స్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం బయటపడింది. దాదాపు 15 మంది మహిళలు,పురుషులు హోటల్స్ లో అభ్యంతరకరమైన స్థితిలో పట్టుబడ్డారు, వారిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్ పథకం పేరుతో అఘాయిత్యాలకు పాల్పడేందుకు కుట్ర జరుగుతందని అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా.. హోటళ్లలో జరుగుతున్న వ్యభిచారం బట్టబయలైంది. ఇది చూసి పోలీసు యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. హోటళ్లలోనే కాకుండా లాడ్జీలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో కూడా దాడులు నిర్వహిస్తామని SDM సదరు అరుణ్ కుమార్ తెలిపారు.
Diabetes : షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం తినాలి..ఏం తినకూడదు!
మరోవైపు,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)వ్యక్తిగత కార్యదర్శి( Personal Secretary)పీపీ మాధవన్‌పై రేప్ కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సోనియా పర్సనల్ సెక్రెటరీ పీపీ మాధవన్(PP Madhavan)పై ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్లో ఐపీసీలోని సెక్షన్లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. జూన్ 25న అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జూన్ 25న పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో ఓ మహిళ..2018లో తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలకు హోర్డింగ్‌లు పెట్టేవాడని,తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడని చెప్పారు...అయితే 2020 ఫిబ్రవరిలో తన భర్త చనిపోయిన తర్వాత తన ఆర్థిక పరిస్థితి దిగజారిందని తెలిపింది. 2020లో ఆయన మరణించే వరకు ఢిల్లీ కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లలో లేబర్‌గా పని చేసేవాడని తెలిసింది. భర్త మరణంతో సహాయం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌ని కలిసినట్లు బాధితురాలు తెలిపింది 'ఆ తర్వాత మాధవ తనకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. ఆ తర్వాత తనకు తరచుగా ఫోన్ కూడా చేస్తుండేవాడని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జాబ్ ఇంటర్వ్యూ గురించి తనకు మాధవన్ మెసేజ్ పంపించి..సురేంద్ర నగర్‌లోని ఓ ఇంటికి వెళ్లాలని సూచించాడని..అక్కడే తనపై మాధవన్ అత్యాచారానికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో బాధిత మహిళ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Prostitution, Prostitution racket