హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: ‘కాంగ్రెస్ చీఫ్ రేసులో నేను ఉన్నా.. ’.. దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Congress: ‘కాంగ్రెస్ చీఫ్ రేసులో నేను ఉన్నా.. ’.. దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కాంగ్రెస్ నేత  దిగ్విజయ్ సింగ్ (ఫైల్)

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (ఫైల్)

Congress Chief: కొన్నిరోజులుగా దేశంలో కాంగ్రెస్ చీఫ్ పదవి పోటీ హట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ ను పెంచుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కొన్నిరోజులుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం పోటీ విషయంలో తీవ్ర రచ్చ కొనసాగుతుంది. మొదటగా సోనియాగాంధీనే (Sonia Gandhi)  మరల, అధ్యక్ష పదవీ చేపట్టాలని అనేక మంది సీనియర్ నేతలు కోరారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul gandhi) కూడా అనేక మంది బలపర్చారు. ఇప్పటికే పదికి పైగా రాష్ట్రాలలోని పీసీసీలు రాహుల్ గాంధీనే చీఫ్ గా ఎన్నుకోవాలని ఏకగ్రీవ తీర్మానంచేసి ఢిల్లీకి పంపాయి. ఈ క్రమంలో శశి థరూర్ కూడా కాంగ్రెస్ చీఫ్ పదవీ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కూడా కాంగ్రెస్ చీఫ్ పదవీ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు అనేక సందర్భాలలో తెలిపారు.

ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్  (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతు.. ఉదయ్ పూర్ లో ఏడాది ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని అంశాలున ప్రస్తావించారు. ఒక వ్యక్తి.. ఒకే పదవీ అని ఆ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.

ఒక వేళ కాంగ్రెస్ చీఫ్ గా అశోఖ్ గెహ్లత్ ఎన్నికైతే, సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు. ఇక పార్టీ చీఫ్ పదవికి పోటీలో ఉన్నారా అన్న ప్రశ్నపై.. పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. ఏదీ ఏమైన మీకు 30 వ తేదీ సాయంత్రం వరకు సమాధానం తెలుస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి పోటీచేసే స్వతంత్రత ఉందని, ఎవరు పోటీ చేయాలని గానీ, చేయకూడదని బలవంతం ఉండదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, 2019 జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత తాను రాజీనామా చేసిన పదవికి తిరిగి రావడానికి రాహుల్ గాంధీ నిరాకరించారు. రాహుల్ గాంధీని చీఫ్ పదవికి పోటీకి ఆసక్తి చూపకపోతే... తాను పోటీ చేస్తానని అశోక్ గెహ్లాట్ చెప్పిన విషయం తెలిసిందే.

Published by:Paresh Inamdar
First published:

Tags: Congress, Delhi, Digvijaya Singh, Rahul Gandhi

ఉత్తమ కథలు