HOME »NEWS »NATIONAL »digital voter id cards launched by election commission of india hsn

Voter ID cards: ఓటర్లుకు శుభవార్త చెప్పిన భారత ఎన్నికల సంఘం.. ఓటరు కార్డు ఇక సరికొత్త రూపంలో..!

Voter ID cards: ఓటర్లుకు శుభవార్త చెప్పిన భారత ఎన్నికల సంఘం.. ఓటరు కార్డు ఇక సరికొత్త రూపంలో..!
(ప్రతీకాత్మక చిత్రం)

మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా డిజిటల్ పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే మన మొబైల్స్ లోనే ఓటు హక్కుకు సంబంధించిన వివరాలు ఉండే ఓ డిజిటల్ కాపీని తెరపైకి తీసుకురాబోతోంది. ఓటరు ఐడీ కార్డులను డిజిటలైజేషన్ చేసే క్రమంలో భాగంగా..

  • Share this:
    ఓటరు కార్డు దారులకు శుభవార్త. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా డిజిటల్ పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే మన మొబైల్స్ లోనే ఓటు హక్కుకు సంబంధించిన వివరాలు ఉండే ఓ డిజిటల్ కాపీని తెరపైకి తీసుకురాబోతోంది. ఓటరు ఐడీ కార్డులను డిజిటలైజేషన్ చేసే క్రమంలో భాగంగా ఓ కొత్త ప్రయోగాన్ని చేపడుతోంది. ఇప్పటివరకు రాబోయే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డిజిటల్ ఓటరు కార్డు కీలకంగా మారుతుందని భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. మొబైల్ నెంబర్ కు ఆ డిజిటల్ ఓటర్ కార్డు అనుసంధానమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    ఓటరు కార్డు డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి రెండు విడతల్లో జరగనుంది. జనవరి 25 నుంచి జనవరి 31 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 1 నుంచి రెండో విడత డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓటరు కార్డు సీరియల్ నెంబర్, ఓటరు ఫొటో, అడ్రస్, తదితర అన్ని వివరాలు ఓ పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉంటాయి. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఈ పీడీఎఫ్ ఫార్మాట్ లో జతచేసి ఉంటుంది. ఈ కాపీని డౌన్ లోడ్ చేసుకుని మొబైల్స్ లో కూడా సేవ్ చేసి ఉంచుకోవచ్చు. జిరాక్స్ కాపీ అవసరం లేకుండా దీన్ని మొబైల్ లో చూపించినా వ్యక్తుల గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు.



    ఈ డిజిటల్ కాపీకి మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక డిజిటల్ కాపీకి, ఒక మొబైల్ నెంబర్ ను మాత్రమే లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మొబైల్ నెంబర్ ను ఓటరు కార్డుకు లింక్ చేసి ఉన్నవాళ్లు అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి ఈ డిజిటల్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ కాపీకి సామాన్య ఓటరు కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు కార్డు పోయిందనో, ఇంకా రాలేదనో చెప్పే సమస్యలకు ఇక చెక్ పెట్టినట్టే. ఆధార్, పాన్ కార్డు వంటి చాలా రకాల గుర్తింపు కార్డులన్నీ డిజిటల్ బాటను ఎప్పుడో పట్టాయి. దీంతో ఓటరు కార్డును కూడా డిజిటల్ రూపంలోకి తీసుకురావాలన్న ఆలోచన చేసినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. https://voterportal.eci.gov.in/ , https://nvsp.in/ లింక్స్ ద్వారా డిజిటల్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
    Published by:Hasaan Kandula
    First published:January 24, 2021, 09:14 IST

    टॉप स्टोरीज