హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Good News: త్వరలో కేంద్ర ఆర్మీ బలగాలకు శాటిలైట్ ఫోన్లు.. 10 లక్షల మందికి ప్రయోజనం

Good News: త్వరలో కేంద్ర ఆర్మీ బలగాలకు శాటిలైట్ ఫోన్లు.. 10 లక్షల మందికి ప్రయోజనం

కమ్యూనికేటింగ్ సాధనాలు, ఫోన్లు వచ్చినప్పటికీ రిమోట్ ఏరియాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు మన సైనికులు కుటుంబాలతో మాట్లాడాలంటే ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కమ్యూనికేటింగ్ సాధనాలు, ఫోన్లు వచ్చినప్పటికీ రిమోట్ ఏరియాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు మన సైనికులు కుటుంబాలతో మాట్లాడాలంటే ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కమ్యూనికేటింగ్ సాధనాలు, ఫోన్లు వచ్చినప్పటికీ రిమోట్ ఏరియాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు మన సైనికులు కుటుంబాలతో మాట్లాడాలంటే ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  ఇంటిని వదిలి సరిహద్దు వద్ద పహారా కాసే మన సైనికులు కుటుంబంతో మాట్లాడాలంటే ఒకప్పుడు ఉత్తరాలే గతి. వాటి ద్వారా ఇంటి నుంచి సమాచారం అందుకునేవాళ్లు. క్రమేణా కమ్యూనికేటింగ్ సాధనాలు, ఫోన్లు వచ్చినప్పటికీ రిమోట్ ఏరియాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు వారితో సంభాషించాలంటే ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో ఇందుకు శాశ్వత పరిష్కారం తీసుకురానుంది మోదీ ప్రభుత్వం. జవాన్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు డిజిటల్ శాటిలైట్ ఫోన్లు అందించేందుకుగాను పరిష్కారం కనుగొనాలని భారత్ బ్రాడ్ బాండ్ నెట్వర్క్ లిమిటెడ్(BBNL)ను ఆదేశించింది. దీంతో ముఖ్యంగా ప్రవేశించలేని, సుదూర ప్రాంతాల్లో పహారా కాస్తున్న 10 లక్షల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది.

  శాటిలైట్ షట్ డౌన్ కారణంగా.. 2019 మే 13 నుంచి భారత ప్రభుత్వ డీస్పీటీ సేవలను పూర్తిగా ఆపేసి మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టాప్-గ్యాప్ అరేంజ్మెంట్ గా సీఏపీఎఫ్ బలగాలకు ఐ-శాట్ పోన్లు అందించారు. అయితే ఐ-శాట్ ఫోన్ల సంఖ్య డీఎస్పీటీ లంటే తక్కువగా ఉంది.

  పనులు జరుగుతున్నాయి..

  శాటిలైట్ల ఫోన్లు అందించే దిశగా పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రభుత్వం శాటిలైట్ ఫోన్ టెర్మినల్స్ పునఃస్థాపనను బీబీఎన్ఎల్ కు ఇచ్చింది. డిజిటల్ కమ్యూనికేషన్ కమీషన్ ఆమోదం ప్రకారం ఈ ప్రాజెక్టును టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) అమలు చేస్తోంది. టెలికమ్యూనికేషన్ విభాగం(DOT) ఇటీవలే హోం వ్యవహారాల మంత్రిత్వశాఖతో సంబంధిత సమాచారాన్ని షేర్ చేసింది.

  దేశంలో సుదూర లేదా సమాచారం చేరవేయలేని ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారు.. వారి కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయడానికి డీఎస్పీటీలను సీఏపీఎల్ కు హోంశాఖ మంజూరు చేసింది. డీఎస్పీటీ సైట్లకు యూఎస్ఓఎఫ్ నుంచి రాయితీ ఇవ్వబడుతుంది. హోంశాఖ, ఎంఓడీ ఏజేన్సీలతో బీబీఎఎన్ఎల్ సమన్వయ పరుస్తూ డీఎస్పీటీ సైట్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్-19 ప్రభావం వల్ల అమలు పరిచే ఏజేన్సీలుకు రవాణా మెటిరీయల్స్ ను చేరవేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫలితంగా పనులు నెమ్మదించాయి. గత కొద్ది నెలలుగా ఈ పనులు వేగవంతం అవుతున్నాయి.

  శాశ్వత పరిష్కారం..

  సమస్య పరిష్కారణకు 2020 జనవరి 21న డాట్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో హోం మంత్రిత్వశాఖ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ హెడ్ క్వార్టర్స్, డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్లెస్ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దూరానికి కనెక్టివిటీని తిరిగి సక్రియం చేయడానికి శాశ్వత పరిష్కారంగా కొనసాగుతున్న భారత నెట్ శాటిలైట్ జీపీ కవరేజ్ పథకం నుంచి వీ-శాట్ టెర్మినల్ మళ్లించడం ద్వారా బీబీఎన్ఎల్ కు అధికార ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్, వైఫై ద్వారా వాయిస్ కాలింగ్ ఉపయోగించి వాయిస్ కాల్ సదుపాయాన్ని అందించాలని కూడా నిర్ణయించారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్ ఉపయోగించడం వల్ల కలగే భద్రతా చిక్కులను ఎంహెచ్ఏ పరిశీలించింది. దాని ఇన్ పుట్లన డాట్ కు అందించింది. తుది నిర్ణయంలో హోం మంత్రిత్వ శాఖ సీఏపీఎఫ్ కు సంబంధించి పునర్నించిన డీఎస్పీటీల జాబితాను డాట్ కోరినట్లు అందించింది.

  జావాన్లు ఎదుర్కొంటున్న కష్టాలు..

  చాలా మంది సీఏపీఎఫ్ జవాన్లు మంచుతో కూడిన భూభాగాల్లో, అసాధారణమైన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. అక్కడ నుంచి కేవలం మూడు నెలలకొకసారి మాత్రమే ఇంటికి వస్తారు. సరైన మొబైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వారు చాలా రోజులపాటు తమ కుటుంబ సభ్యులను సంప్రదించలేరు. అసోం రైఫిల్స్(ఏఆర్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజ్వర్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), ఇండో టిబేటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లాంటి బలగాల్లో 10 లక్షల మందికిపైగా సీఏపీఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇవి కాకుండా సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)లోనూ ఉన్నారు.

  First published:

  Tags: Indian Army, Union Home Ministry

  ఉత్తమ కథలు