హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Digital belts For Cows: ఆవులు, గేదెలకు అనారోగ్యమా? రెండు రోజుల ముందే మీకు తెలుస్తుంది.. ఎలాగంటే..

Digital belts For Cows: ఆవులు, గేదెలకు అనారోగ్యమా? రెండు రోజుల ముందే మీకు తెలుస్తుంది.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Digital health benefits for cows: పాడిరైతులకు ఉపయోగపడే ఇజ్రాయెల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు గుజరాత్‌కు చెందిన రైతులు. డిజిట్ బెల్ట్స్ టెక్నాలజీ సాయంతో ఆవులు, గేదెల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

పాడిరైతులకు ఉపయోగపడే ఇజ్రాయెల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు గుజరాత్‌కు చెందిన రైతులు (Gujarat Farmers). డిజిట్ బెల్ట్స్ టెక్నాలజీ సాయంతో ఆవులు, గేదెల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పశువులు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉంటే వెంటనే డిజిటల్‌ బెల్ట్‌ (Digital Health Belts for cows)లు హెచ్చరిస్తాయి. ఈ వ్యవస్థను టెలికాం ఆపరేటర్‌లు మంచి బిజినెస్‌గా చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లా ఉమ్రేత్ తాలూకాలోని షిలి గ్రామానికి చెందిన పాడి రైతు కమలేష్ పాండ్యా.. కొత్త టెక్నాలజీ సాయంతో ఆవులను పెంచుతున్నారు. ఏదైనా ఆవు లేదా గేదె అనారోగ్యం బారిన పడే రెండు రోజుల ముందే కమలేష్‌ పాండ్యాకు తెలుస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ (Israel Technology) భారతదేశంలోని పాడి రైతులకు ఉపయోగపడుతోంది.

ఈ రోజుల్లో ఫిట్‌నెస్ బ్యాండ్‌లు (Fitness Bands) లేదా ట్రాకర్‌లు (Health Trackers) వంటి హెల్త్‌ డివైజ్‌లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఆనంద్‌లో మిల్క్‌షెడ్‌ ప్రాంతంలోని ఆవులు మెడకు డిజిటల్ బెల్ట్‌లు కనిపిస్తాయి. ఆవుల కదలిక ఆధారంగా, చిప్‌ ఉన్న బెల్ట్‌లు పశువుల ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేస్తుంటాయి. అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటే యజమానులను, అలాగే ఆనంద్‌లోని అమూల్ డెయిరీ ప్రత్యేక కాల్ సెంటర్‌ను అలర్ట్ చేస్తే మెసేజ్‌ పంపుతుంది.

Telangana : షాద్‌నగర్‌లో పులి పేరుతో పులిహోర .. ఆశ్చర్యపోయిన అధికారులు, పోలీసులు

పశువుల మెడలో ఉండే ఈ డిజిటల్ బెల్ట్ రైతుల మొబైల్ ఫోన్‌లకు సమాచారం పంపుతుంది. సమాచారాన్ని ప్రసారం చేయడం అనే విభాగాన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మంచి మార్కెట్‌గా చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు అమూల్ డెయిరీని సంప్రదించాయి. వచ్చే ఏడాదిలోపు లక్ష పశువులను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

2008 నుంచి డైరీ ఫారమ్‌ను నిర్వహిస్తున్న పాండ్యా మాట్లాడుతూ..‘సాధారణంగా, ఒక ఆవును చూసినప్పుడు, అది జబ్బుగా ఉందని మీరు గుర్తించలేరు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా.. ఆవు అనారోగ్యం బారిన పడబోయే రెండు రోజుల ముందే నా మొబైల్ ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. అప్పుడు ఉష్ణోగ్రతను పరిశీలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ టెక్నాలజీ సాయంతో కలిగే పెద్ద ప్రయోజనం. ముందుగానే చికిత్స ప్రారంభిస్తే ఆవులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.

* లక్ష డిజిటల్ బెల్టులపై టెల్కోల కసరత్తు

రైతులు పశువుల సైలెంగ్‌ హీట్‌ (సెక్సువల్‌ రెసెప్టివ్‌) గురించి అలర్ట్ పొందడం అతిపెద్ద ప్రయోజనం. ఇది కృత్రిమ గర్భధారణ (AI) సమయానికి జరుగుతుందని, పశువు ఆలస్యం చేయకుండా గర్భం దాలుస్తుందని నిర్ధారిస్తుంది. ఇటువంటి సైలెంట్‌ హీట్‌ సైకిల్స్‌ను గుర్తించకపోతే రైతు సంవత్సరానికి దాదాపు రూ.15,000 నష్టపోతాడు.

అమూల్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ వ్యాస్ మాట్లాడుతూ..‘మీ చేతుల్లో ఫిట్-బిట్‌లు వాకింగ్ స్టెప్పుల సంఖ్య లేదా పల్స్ రేటును గుర్తిస్తాయి. ఈ డిజిటల్ బెల్ట్‌లు/ట్రాకర్లు పశువు సరిగ్గా తింటోందా? సరిపడా నీళ్లు తాగుతోందా? అని తెలుసుకోవడానికి సహాయపడతాయి. పశువు ఎప్పుడు గర్భం దాల్చింది లేదా ఎప్పుడు గర్భస్రావం అయింది అనే డేటా కూడా ఉంటుంది. పాడి రైతులకు భూమి తక్కువగా ఉన్నందున ఇజ్రాయెల్ టెక్నాలజీని భారతీయ పరిస్థితులకు, పర్యావరణానికి అనుగుణంగా మాడిఫై చేశారు. మేము 10,000 డిజిటల్ బెల్ట్‌లను లక్ష్యంగా చేసుకున్నాం, వాటిలో 3,200 ఇప్పటికే అందజేశాం, మా లక్ష్యం ఒక సంవత్సరం లోపు లక్ష పశువులను కవర్ చేయడం’ అని వ్యాస్ చెప్పారు.

Zomato: అయ్యా.. ఇదిగో ఇదీ జొమాటో మోసం.. మరీ ఇంత అన్యాయమా..! జొమాటోకు షాకిచ్చిన కస్టమర్

అగ్రిమెంటు కుదుర్చుకోవడానికి ఇటీవల ఒక టాప్ టెలికాం కంపెనీ తమను సంప్రదించడంతో అమూల్ డెయిరీ అధికారులు ఆశ్చర్యపోయారు. వారు 10,000 మంది వినియోగదారులను చూస్తున్నారు, ఇది చివరికి లక్ష మంది సబ్‌స్క్రైబర్ బేస్‌గా మారుతుంది అని వ్యాస్‌ చెప్పారు. ప్రస్తుతం ఒక పాడి రైతు తన పశువు మెడలో కట్టిన ఒక డిజిటల్ ట్రాకర్ కోసం ఒక్కో దానిపై రోజుకు రూ.5 ఖర్చు చేస్తున్నారు. చివరికి, వాల్యూమ్‌లు పెరగడం, టెక్నాలజీని కూడా మరింత అభివృద్ధి చేస్తున్నందున, ఈ ధరను ఒక పశువుపై రోజుకు రూ. 1 కి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

First published:

Tags: Agriculture, Farmers, Gujarat, Israel

ఉత్తమ కథలు