హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా వంటలు... ఆ స్కూల్‌లో ఏం జరుగుతోంది?

సర్వమత సమానత్వాన్ని చాటే దేశం మనది. ఇలాంటి దేశంలో విద్యార్థుల్లో సమానత్వాన్ని పెంచాల్సిన ఆ స్కూల్ యాజమాన్యం... మత పరమైన విభేదాలు చూపిస్తుండటం చర్చనీయాంశమైంది.

news18-telugu
Updated: September 13, 2019, 7:38 AM IST
హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా వంటలు... ఆ స్కూల్‌లో ఏం జరుగుతోంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సుతీర్ ఐరన్ బ్లాక్‌లోని రామ్ దోబా మాధ్యమిక స్కూల్ ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కింది. కారణం... ఈ స్కూల్‌లో... హిందువులు, ముస్లిం విద్యార్థులకు వేర్వేరుగా వంటలు వండి పెడుతున్నారు. రెండు వంట గదుల్లో... ఇద్దరు వంటవాళ్లతో వేర్వేరు వంటలు ఎందుకు వండిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇలా వండి పెట్టమని ఎవరూ అడగలేదు. స్కూల్ యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారు. పిల్లల మధ్య మతపరమైన చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం పద్ధతి మార్చుకోలేదు. దీనిపై విద్యా శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై న్యూస్18 ప్రశ్నించగా... పరిశీలిస్తామని బ్లాక్ ఆఫీసర్ తెలిపారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు