మరింత పెరిగిన డీజిల్ ధరలు..యధాతథంగా పెట్రోల్
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం, ఇతర అంతర్జాతీయ పరిస్థితుల కారణంగానే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
news18-telugu
Updated: October 15, 2018, 10:31 AM IST

మరింత పెరిగిన డీజిల్ ధరలు
- News18 Telugu
- Last Updated: October 15, 2018, 10:31 AM IST
కేంద్రం, పలు రాష్ట్రాలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా...ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను రోజూ పెంచుతూనూ ఉన్నాయి. సోమవారం దేశంలో నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో డీజిల్ ధర లీటరుపై 8 పైసలు నుంచి 9 పైసలు మేర పెరిగింది.
దిల్లీ, కోల్కత్తాలో డీజిల్పై 8 పైసలు పెరగ్గా...ముంబై, చెన్నైలలో 9 పైసలు పెంచారు. సవరించిన ధరల ప్రకారం దిల్లీలో లీటరు డీజిల్ రూ.75.46కు చేరగా...కోల్కతాలో రూ.77.31కి చేరింది. ముంబైలో రూ.79.11, చెన్నైలో రూ.79.80కి పెరిగింది. అదే సమయంలో నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మాత్రం యధాతథంగా ఉన్నాయి.
గత కొన్ని మాసాలుగా ఇంధన ధరలు ప్రతి రోజూ పైపైకి దూసుకుపోతుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం, ఇతర అంతర్జాతీయ పరిస్థితుల కారణంగానే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని చెబుతూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది.

Petrol Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...వినియోగదారులకు స్వల్ప ఊరట
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రూ.7 పెరగనున్న పెట్రోల్ ధరలు..
బడ్జెట్ 2019 : పెరిగినవి ఏవి..? తగ్గనినవి ఏవి..?
Budget 2019: పెరగనున్న పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు
Petrol Price : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... ఎన్నికలు అయిపోగానే...
ఎన్నికలు ముగిశాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి..
Loading...