హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కండోమ్ ఫ్రీ వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ ఘటన.. క్లారిటీ ఇచ్చిన బాలిక.. తన ఉద్దేశ్యం..

కండోమ్ ఫ్రీ వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ ఘటన.. క్లారిటీ ఇచ్చిన బాలిక.. తన ఉద్దేశ్యం..

మీడియా సమావేశంలో బాలిక

మీడియా సమావేశంలో బాలిక

Bihar: కండోమ్ కూడా ఉచితంగా కావాలా.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారితీసింది. ఇదిలా ఉండగా దీనిపై సదరు బాలిక స్పందించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

రెండు రోజుల క్రితం బీహర్ లోని (Bihar) పాట్నాలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హర్జోత్ కౌర్ బమ్రా (HARJOT KAUR BHAMRA) పాల్గోన్నారు. ఆమె విద్యార్థినుల సమస్యలను వింటున్నారు. ఇంతలో ఒక బాలిక తమకు ప్రభుత్వం శానిటరీ న్యాప్ కిన్ లను ఉచితంగా ఇస్తుందా అంటూ అడిగారు. అయితే.. దీనిపై కలెక్టర్ జీన్ ప్యాంట్, బూట్లు, రేపు కండోమ్ లుకూడా ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుందంటూ వేటకారంగా మాట్లాడారు. దీనిపై బాలిక క్లారిటీ ఇచ్చింది. తాను.. మురికివాడల్లో కొందరు నివసిస్తున్నారని, వారికి కనీస అవసరాలు తీరేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని ఇలా ప్రశ్నించారని కానీ కలెక్టర్ అలా స్పందిస్తారని అనుకొలేని యువతి తెలిపింది.

తనకు నాప్ కిన్ కొనుక్కునే స్థామత ఉందని కానీ.. కొందరు అది కూడా కొనుక్కొలేరని పైవిధంగా అడగాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఇక దీనిపై ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ సీరియస్ అయ్యారు. అటూ జాతీయ మహిళా కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.

బీహార్ లోని పాట్నాలో అమ్మాయిల పట్ల వివక్షతను రూపుమాపడం అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనిలో స్థానిక మహిళ కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా (IAS officer Harjot Kaur Bhamra) పాల్గొన్నారు. దీనిలో ఆమె కొందరు విద్యార్థులతో పాఠశాలలోని సమస్యలు ఏవైన ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఒక యువతి.. తమ పాఠశాలలో మరుగు దొడ్డి సమస్యగాఉందని, డోర్ లు సరిగ్గా లేవని చెప్పింది. తమ పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తో చెప్పింది. దీనిపై కలెక్టర్ మీ ఇంట్లో ఎన్ని మరుగు దొడ్డులు ఉన్నాయనిబాలికను ప్రశ్నించారు. అంతే కాకుండా.. ప్రభుత్వం విద్యార్థినులకు 20,30 శానిటరీ ప్యాడ్ లను ఇవ్వగలదా అని ప్రశ్నించింది.

దీనిపై కలెక్టర్ కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రేపు మీకు జీన్స్ ప్యాంట్ ఇస్తుంది.. ఆ తర్వాత బూట్లు, ఇలా ప్రతి ఒక్కటి ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుందని కలెక్టర్ హర్జోత్ కౌర్ భమ్రా చురకలంటించారు. అంతే కాకుండా చివరకు కుటుంబ నియంత్రణ కోసం కండోమ్ కూడా ప్రభుత్వమే ఇస్తుందని కూడా విద్యార్థినితో అన్నారు. దీనికి విద్యార్థిని.. ప్రజలు ఓట్లు వేయడం వలన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పింది. దీనికి కలెక్టర్ మరీ.. పాకిస్థాన్ మాదిరిగా ఓట్లు వేయకండని వ్యాఖ్యలు చేసింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, VIRAL NEWS

ఉత్తమ కథలు