సామాన్యుడి స‌క్సెస్ స్టోరీ.. జ‌న‌తా ఇండస్ట్రీస్

అమీరోద్దిన్(Amiroddin)

జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగాల‌ని ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ అందులో కొందరి కలలు మాత్రమే నెరవేరతాయి.. అందుకు క‌ృషి, పట్టుదల ఎంతో అవసరం

 • Share this:
  నిజామాబాద్ : జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగాల‌ని ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ కొందరి కలలు నెరవేరుతాయి.. మరికొందరి క‌ల‌లు కలలుగానే మిగిలిపోతాయి. అయితే కృషి ప‌ట్టుద‌ల ఉంటే ఏదైన సాధ్యమే అని ధర్మాబాద్‌కు చెందిన అమిరోద్దిన్ షేక్ నిరుపించారు. చిన్నపాటి మిర్చి పౌడర్‌ను తయారు చేసే యంత్రంతో మొద‌లెట్టి.. నేడు దేశ విదేశాలకు కారం పొడి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. తన పట్టుదలతో ఆయన కుటుంబంతో పాటు ఎందరో పేదలకు ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నాందేడ్ జిల్లా క‌లెక్ట‌ర్..  ఆయనకు ఉత్తమ వ్యాపార వేత్త అవార్డును అమిరోద్దిన్ షేక్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయనను సత్కరించారు

  కూరల్లో వాడే పొడి కారానికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వినియోగదారులకు అవసరమైన రకాలను అక్కడి వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. నిజామాబాద్ జిల్లా వాసుల‌తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కారం కోసం ప్రత్యేకంగా ధర్మాబాద్‌కు రావడం విశేషం. తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ధర్మాబాద్.. నిజామాబాద్ జిల్లా సరిహద్దు నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాందేడ్ జిల్లా పరిధిలో ధర్మాబాద్ తాలూకాకు రైల్వె మార్గంతో పాటు బస్సు సౌకర్యం ఉండడంతో నిజామాబాదు జిల్లా నుండి నిత్యం వ్యాపార లావాదేవీల కోసం రాకపోకలు సాగుతుంటాయి. ఇక, ధర్మాబాద్ ను అనుకోని ఉన్న బాలాపూర్ తెలంగాణ‌ భూభాగంలో ఉంది. బాలాపూర్, ధర్మాబాద్ కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తోంది

  ధ‌ర్మాబాద్ కు చెందిన అమిరోద్దిన్ షేక్ 1984లో చిన్న పాటి మిర్చి నూర్పిడి చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశాడు... ప్రజలు మిరపకాయల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుక వచ్చి నూర్పిడి చేయించుకునే వారు. అప్పుడు అతని మదిలో ఓ ఆలోచన మెదిలింది.. మిరపకాయలను తీసుకొచ్చి ఇక్కడే విక్రయం జరిపి నూర్పిడి చేస్తే గిరాకీ పెరుగుతుందని భావించాడు. చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకొని రుణాన్ని పొందాడు. అలా ప్రారంభించిన చిన్న పరిశ్రమ.. దిన‌దిన అభివృద్ది చెంది జ‌న‌తా ఇండస్ట్రీస్ గా మారింది.. దీంతో వెనుదిరిగి చూడకుండా అమిరోద్దిన్ షేక్ ముందుకు సాగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ధర్మాబాద్ లో నెలకొన్న ఈ పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. విదేశాలకు సైతం ఇక్కడి నుంచి కారం, ధనియా పౌడర్, పసుపు పొడి ఎగుమతి జరుగుతుంది.

  ప్ర‌తి సంవ‌త్స‌రం సీజన్‌లో ఇక్కడకి పెద్ద ఎత్తున జనం కారం పోడి కొసం వ‌స్తుంటారు. మిరపకాయల వెరైటీలను నూర్పిడి చేసేందుకు ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఫ్రీగా పట్టించడం ప్రారంబించారు అమిరోద్దిన్. దీంతో ప్రజలు ఆకర్షితులయ్యారు.. అదే రకంగా ఇక్కడ నాలుగు రకాల వెరైటీ మిరపకాయలు దొరకడంతో వినియోగాదారుల‌ను క్యూక‌ట్టారు. కుటీర పరిశ్రమగా మొదలు పెట్టి నేడు పెద్ద తరహా పరిశ్రమ స్థాయికి ఎదిగారు. ధర్మాబాద్‌కు చెందిన అమిరోద్దిన్ షేక్ కు ఉత్తమ వ్యాపారవేత్తగా నాందేడ్ క‌లెక్ట‌ర్ అవార్డు ఇచ్చి స‌న్మానించారు. ఈ అవార్డును జిల్లా పరిశ్రమల కేంద్రం నుండి ఇవ్వడం జరిగిందని అమిరోద్దిన్ తెలిపారు.
  Published by:Sumanth Kanukuka
  First published: