ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న బస్సులు... పలువురు ప్రయాణికులకు గాయాలు

ఎయిర్ పోర్టులో రేసు పెట్టుకున్నట్లు బస్సుల్ని పరుగులు పెట్టించారు. ప్రయాణికులు వద్దని వారిస్తున్న కొద్దీ... స్పీడ్ మరింత పెంచారు.

news18-telugu
Updated: July 14, 2019, 10:50 AM IST
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న బస్సులు... పలువురు ప్రయాణికులకు గాయాలు
ఢిల్లీ ఎయిర్ పోర్టు
news18-telugu
Updated: July 14, 2019, 10:50 AM IST
రోడ్డుపై బస్సులు ఢీకొనడం .. సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఢిల్లీలో కూడా ఇలాంటి ఓ ప్రమాదం జరిగింది. అయితే అలా రోడ్డుపై జరగలేదు. విమానాలు ఎగిరే ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టులో ఓ విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో అందులో వచ్చిన ప్రయాణికుల్ని... టెర్మినల్ వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే రెండు బస్సులు ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నాయి. ఆ రెండు బస్సుల డ్రైవర్లు పోటీ పడ్డారు. ఎయిర్ పోర్టులో రేసు పెట్టుకున్నట్లు బస్సుల్ని పరుగులు పెట్టించారు. ప్రయాణికులు వద్దని వారిస్తున్న కొద్దీ... స్పీడ్ మరింత పెంచారు. దీంతో ఒక్కసారిగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయాలయ్యాయి. ఇద్దరికి కంటిపై. ఒకరి తలకి తీవ్రగాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చేసేందుకు ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ప్రయాణికులు ఒప్పుకోలేదు. ఇద్దరి డ్రైవర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బస్సు నడిపింది డ్రైవర్లు కాదని అనుమానిస్తున్నారు అధికారులు. హెల్పర్స్ బస్సును డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. విమానాలు ల్యాండ్ అయ్యే సున్నిత ప్రదేశమైన ఎయిర్ పోర్టులా బస్సులు ర్యాష్‌గా నడపడం సరికాదంటున్నారు ప్రయాణికులు. బస్సు పొరపాటున ఏదైనా విమానానికి ఢీకొని ఉంటే... ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...