ఎయిర్ ఇండియా (Air India)కు డీజీసీఏ (DGCA) ఊహించని షాకిచ్చింది. మూత్ర విసర్జన కేసులో నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించడమే కాకుండా విధులు సక్రమంగా నిర్వర్తించని విమాన ఫైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్ ను 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. రెగ్యులర్ ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసులపై రూ. 3లక్షల జరిమానా విధించింది. న్యూయార్క్ నుండి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై తాగిన మైకంలో మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్ల DGCA ఈ మేరకు చర్యలు తీసుకుంది.
Air India (AI) passenger urinating case of Nov 26 | DGCA imposes a fine of Rs 30 lakhs on Air India for violation of rules, suspends the license of Pilot-In-Command of the flight for 3 months for failing to discharge his duties&Rs 3 lakhs fine on AI's Director-in-flight services
— ANI (@ANI) January 20, 2023
గతేడాది నవంబర్ 26న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో మహిళకు శంకర్ మిశ్రాకు మధ్య రాజీ కుదిరిందని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది. కానీ జనవరి 4న ఆ మహిళ ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సందర్భంలో ఎయిర్ ఇండియా (Air India) శంకర్ మిశ్రాను 4 నెలల పాటు నిషేధిస్తున్నట్టు పేర్కొంది.
మద్యం మత్తులో నేరం చేయడం పైగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక సాక్ష్యులను బెదిరించడం, తారుమారు చేసే అవకాశం ఉన్నందున కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీసీఏ చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం, ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడంతో ఎయిర్ ఇండియా (Air India)కు భారీ జరిమానా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India