Home /News /national /

DGCA BARS 90 SPICEJET PILOTS FROM FLYING BOEING 737 MAX PLANES DUE TO IMPROPER TRAINING MKS

DGCA | SpiceJet : 90 మంది పైలట్లపై నిషేధం.. వివాదాస్పద Boeing 737 విమానాలు నడపొద్దు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారీ ప్రమాదాలకు మారుపేరుగా నిలుస్తోన్న Boeing 737 Max విమానాలను నడిపే పైలట్ల విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రకం ఫ్లైట్లు నడపొద్దని స్పైస్ జెట్ కు చెందిన 90 మంది పైలట్లను నిషేధించింది.

విపత్తు స్థాయిలో భారీ ప్రమాదాలకు మారుపేరుగా నిలుస్తోన్న Boeing 737 Max విమానాలను నడిపే పైలట్ల విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మోడల్ విమానాలను నడపరాదంటూ ఏకంగా 90 మంది పైలట్లపై నిషేధం విధించింది. వీరంతా స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ నియమించుకున్నవాళ్లే కావడం గమనార్హం. భారత్ లో పౌర విమానయానానికి సంబంధించి అత్యున్నత విభాగం ‘డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)’ బుధవారం కీలక ప్రకటన చేసింది.

బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడపకుండా స్పైస్ జెట్ కు చెందిన 90 మంది పైలట్లపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నిషేధం విధించింది. ఈ విమానాలను నడిపే సామర్థ్యాలు వారిలో లేవని గుర్తించింది. అందుకే మరో విడత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకునే వరకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడపకుండా నిషేధం విధించింది.

Vastu Tips: ఇంట్లో ఇవి పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు.. అదృష్టం కలిసొస్తుంది..


'ప్రస్తుతానికి ఈ పైలట్లు 'మ్యాక్స్' విమానాలు నడపకుండా ఆంక్షలు విధిస్తున్నాం. పైలట్లంతా మరోసారి శిక్షణ తీసుకోవాలి. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసినవారు విమానాలు నడపొచ్చు' అని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి పైలట్ల నియామకం వెనక ప్రధాన కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Vidadala Rajini: ఆంధ్రా ఆరోగ్య మంత్రి విడదల రజని పక్కా తెలంగాణ బిడ్డ! -యాదాద్రి జిల్లాలో సంబురాలు


గత కొన్నేళ్లుగా భారీ విమాన ప్రమాదాలు, భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్న ప్రమాదాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్​క్రాప్టులకే కావడం, బోయింగ్ సంస్థ ఆ విమానం తీరుతెన్నుల గురించిన పూర్తి సమాచారాన్ని పైలట్లకు చెప్పకపోవడం వల్లే విపత్కర పరిస్థితుల్లో అంచనాలు తారుమారవుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలు నివేదికలు రావడం, కొన్నేళ్ల కిందట బోయిగ్ 737 మ్యాక్స్ మోడల్ విమానలు అన్నిటినీ గాల్లోకి ఎగరకుండా చాలా దేశాలు కట్టడి చేయడం, పైలట్లకు అన్ని విషయాలపై శిక్షణ ఇచ్చిన తర్వాతే తిరిగి అనుమతులు పునరుద్ధరించడం లాంటి ఘటనలు జరిగాయి. అయినాసరే, బోయింగ్ 737 ప్రమాదాలు ఆగలేదు. ఇటీవల చైనాలో 130 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రమాద ఘటనలోని విమానం కూడా బోయింగ్ 737నే కావడం గమనార్హం.

Telangana BJP: కమలదళంలో కలకలం.. ఆ నేతకు భరించలేని అవమానం! -అసలేం జరుగుతోంది?


2019లో ఇథియోపియా ఎయిర్​లైన్​కు చెందిన 737 బోయింగ్ మ్యాక్స్ ఎయిర్​క్రాఫ్ట్ కుప్పకూలి, 157 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత ఈ తరహా విమానాలను డీజీసీఏ నిషేధించింది. బోయింగ్ సంస్థ సాఫ్ట్​వేర్​లో మార్పులు చేసిన తర్వాత గతేడాది ఆగస్టులో నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ విమానాలు నడిపే పైలట్లు అందరూ సరైన శిక్షణ తీసుకోవాలని అప్పట్లోనే స్పష్టంగా చెప్పింది. కానీ స్పైస్ జెట్ తన బోయింగ్ విమానాలను నడిపే పైలట్లకు సరైన శిక్షణ ఇవ్వకుండానే డ్యూటీలు కేటాయిస్తున్నట్లు వెల్లడైన క్రమంలో డీజీసీఏ చర్యలకు దిగింది.

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్ .. బూడిదేనా?


బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని నడిపే పైలట్లు స్పైస్​జెట్​కు 650 మంది ఉన్నారు. అయితే, డీజీసీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో 90 మందిని విధులకు దూరంగా ఉంచింది. శిక్షణ పూర్తి అయిన తర్వాత నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు తీసుకొని వీరిని విధుల్లోకి తీసుకోనుంది. దీని వల్ల సేవలకు అంతరాయం కలగడం లేదని స్పైస్​జెట్ స్పష్టం చేసింది. శిక్షణ పొందిన 560 మంది పైలట్లు అందుబాటులోనే ఉన్నారని వెల్లడించింది. 11 మ్యాక్స్ ఎయిర్​క్రాఫ్ట్​లు యథావిధిగా నడుస్తున్నాయని తెలిపింది. వీటిని నడిపేందుకు 144 మంది పైలట్లు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇండియాలోని ఎయిర్​లైన్లలో స్పైస్​జెట్ మాత్రమే బోయింగ్ మ్యాక్స్ విమానాలను నడిపిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Boeing, DGCA, Pilot, SpiceJet

తదుపరి వార్తలు